– పలుచోట్ల నీళ్లు నిలిచి ట్రాఫిక్‌కు ఇబ్బందులు
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్17: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అర్‌పేట్, సనత్‌నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందనాగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యూసుఫ్‌గూడా కృష్ణానగర్ బి బ్లాక్‌లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాదాపూర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. అర్‌పేట, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, యూసుఫ్‌గూడ, అర్‌పేట్, పంజాగుట్ట, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మరోవైపు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనాలు బారులుతీరాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



