రైల్వే అంశాలను త్వరగా పరిష్కరించాలి

– సి.ఎస్ రామకృష్ణా రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అన్నారు. రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు సంబందించిన అపరిష్కృత అంశాలపై ఆయన మంగళవారం సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రైల్వే అండర్  బ్రిడ్జిలు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రజా రవాణా మరింత మెరుగుపరచడం తదితర దాదాపు 21 అంశాలపై సమీక్షించారు. ఈ పెండింగ్ అంశాలకు సంబంధించి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ప్రధానంగా మున్సిపల్, జలమండలి, రెవిన్యూ, విధ్యుత్, రోడ్లు భవనాల శాఖల అధికారులు సంయుక్త తనిఖీలను నిర్వహించి తగు పరిష్కార మార్గాలను చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ఈ రైల్వే ప్రాజెక్టుల పెండింగ్ అంశాలపై త్వరలోనే రైల్వే ఉన్నతాధికారులతో సమావేశం జరుగుతుందని, ఈలోపు ప్రతీ పెండింగ్ అంశానికి తగు నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, జయేష్ రంజన్, నవీన్ మిట్టల్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి,   జీహెచఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, దక్షిణ మండలం విద్యుత్ సరఫరా సంస్థ ఎండీ జితేష్ పాటిల్, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరి తదితర అధికారులు హాజరయ్యారు.

——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *