– వోట్ల దొంగతనానికి ఈసి సహకారం
– తన ఆరోపణలపై ఇసి ఎందుకు మౌనం
– వెంటనే ప్రజలకు నిజాలు వెల్లడిరచాలి
– బెంగళూరు సమావేశంలో రాహుల్ తీవ్ర విమర్శలు
బెంగళూరు,ఆగస్ట్ 8: ఎన్నికల సంఘం తన బాధ్యతల్ని విస్మరిస్తోందని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన సంస్థ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. వోట్లను దొంగిలించేందుకు ఎన్నికల సంఘం సహకరిస్తోందని ఆయన విమర్శించారు. బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం మరోసారి ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా విమర్శించారు.ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ప్రజలు చైతన్యంతో ఉండాలని, ఈ ఎన్నికల్లో న్యాయం నిలవాలంటే అధికార యంత్రాంగం కక్ష సాధింపులు చేయకుండా వ్యవహరించాలంటూ రాహుల్ గాంధీ హితవు పలికారు. అంతేకాదు, కర్ణాటకతో పాటు- ఇతర రాష్టాల్ల్రో కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో విూరు రాజ్యాంగాన్ని తాకాలని అనుకుంటే, ఒకసారి ఆలోచించాలని సూచించారు. ఈ విషయంలో విూరు ఎంత తెలివిగా దాక్కున్నా, మేము మిమ్మల్ని పట్టుకుంటామన్నారు. ఇందుకు కొంచెం సమయం పట్టొ-చ్చు, కానీ తప్పకుండా పట్టుకుంటామని రాహుల్ గాంధీ ఎన్నికల సంఘానికి వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలు దేశ గుండె చప్పుడని, అలాంటి క్రమంలో ఒక్క వోటు- దొంగిలించబడినా అది జనాభా గొంతును నొక్కేయడమేనని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ఇలాంటి ఘటనలు జరిగితే, అది రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా డెమాక్రసీకి సవాల్‌గా మారుతుందన్నారు. నిజంగానే ఎన్నికల సంఘం ఎవరి పక్షం వైపు ఉందని ప్రశ్నలు పలువురిలో వొచ్చే అవకాశం ఉంది. ఇది ఒక్క కర్ణాటక సమస్య మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ఎన్నికల సమగ్రత గురించి చర్చకు దారితీస్తుంది. కానీ, రాహుల్ గాంధీ ఇక్కడితో ఆగలేదు. ఆయన రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దాన్ని కాపాడటానికి తాము ఎంతకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ ఐదు ప్రశ్నలు సంధించారు. డిజిటల్ ఓటర్ల జాబితాను ఎందుకు దాచి పెడుతున్నారు?. సీసీ పుటేజీని ఎందుకుఎవరి ఆదేశాలతో తొలగిస్తున్నారు? నకిలీ వోట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు. విపక్షాలను ఈసీ ఎందుకు భయపెడుతోంది. భాజపా ఏజెంట్‌గా ఈసీ మారిపోయిందా?అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్యం ఎంతో అమూల్యమైనదని ఈ సందర్భంగా రాహుల్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానంలోని మహదేవపుర అసెంబ్లీ స్థానంలో లక్ష కంటే ఎక్కువ దొంగ ఓట్లున్నాయి. ఎన్నికల సంఘం బిజెపితో కుమ్మక్కయ్యిందని రాహుల్ ఆరోపించారు. 40 మందితో కూడిన బృందం ఆరు నెలలపాటు- నిర్వహించిన విశ్లేషణలో వేలాది నకిలీ ఎంట్రీలు, నకిలీ చిరునామాలు చెల్లని ఫొటోలు, అనుమానాస్పద ఫారం 6 దరఖాస్తులు బయట పడ్డాయని రాహుల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్, సిఎం సిద్దరామయ్య, డిప్యూటి సిఎం డికె శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే రాహుల్ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. తను చేసే వాదనలను ధృవీకరిస్తూ అధికారిక ప్రకటనపై సంతకం చేయాలి లేదా దేశానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి ఎన్నికల సంఘం సవాల్ విసిరింది. రాహుల్ గాంధీ దగ్గర రెండు ఆప్షన్‌లే ఉన్నాయి. ఒకటి ఆయన చేసే ఆరోపణలు నిజమనుకుంటే.. డిక్లరేషన్‌పై సంతకం చేయడం లేదా.. ఇసిఐపై అసంబద్ధ ఆరోపణలు చేసినందుకు దేశానికి క్షమాపణలు చెప్పడం అని ఎన్నిక సంఘం వర్గాలు తెలిపాయి.



