పదేళ్లుగా మా బావను వెంటాడుతున్నారు

రాబర్ట్‌ వాద్రాపై కేసులో రాహుల్‌ విమర్శలు

న్యూదిల్లీ, జూలై 18 :మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా తన బావ రాబర్ట్‌ వాద్రాను వెంటాడుతూనే ఉందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దురుద్దేశంతో, రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును ఎదుర్కొనేందుకు రాబర్ట్‌ వాద్రా, ప్రియాంకల కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీటిని తట్టుకునే ధైర్యం వారందరికీ ఉందని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఓ భూ ఒప్పందానికి సంబంధించి అక్రమాలకు పాల్పడిన కేసులో రాబర్ట్‌ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపైనే శుక్రవారం రాహుల్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. తాజా చార్జిషీటు కూడా ఆ కోవకు చెందినదేనని విమర్శించారు. హరియాణాలోని శికోప్‌ాపుర్‌లో భూ ఒప్పందానికి సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు రాబర్ట్‌ వాద్రాపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఈడీ ఇప్పటికే పలుమార్లు ఆయనను విచారించింది. ఈ క్రమంలో గురువారం ఆయనపై అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *