చిక్కుల్లో రాహుల్‌ ‌గాంధీ

ఎన్నికల కమిషనర్‌పై ఆరోపణల వ్య‌వ‌హారం

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 19: వోట్ల చోరీపై నిర్వహించిన ప్రెస్‌ ‌మీట్‌తో కాంగ్రెస్‌ అ‌గ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ చిక్కుల్లో పడ్డారు. దేశంలో వోట్ల చోరీపై దిల్లీలోని కాంగ్రెస్‌ ‌కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్‌లో రాహుల్‌ ‌విలేఖరుల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌(‌సీఈసీ) జ్ఞానేశ్‌ ‌కుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. వోటు దొంగలను, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులను ఆయన రక్షిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ‌ద్వారా వోట్ల తొలగింపునకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. కర్ణాటకలోని ఆలంద్‌, ‌మహారాష్ట్రలోని రజోరా నియోజకవర్గాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రెస్‌ ‌మీట్‌లో వోట్లు ఎలా చోరీకి గురవుతున్నాయో వివరిస్తూ ఓ ఫోన్‌ ‌నంబర్‌ను రాహుల్‌ ‌ప్రదర్శించారు. అది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అంజనీ మిశ్రా అనే వ్యక్తి ఫోన్‌ ‌నంబర్‌. ‌రాహుల్‌ ‌ప్రెస్‌ ‌మీట్‌ ‌తర్వాత ఆ నంబర్‌కు ఫోన్‌ ‌కాల్స్ ‌వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై అంజనీ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు. రాహుల్‌ ‌ప్రెస్‌ ‌మీట్‌ ‌తర్వాత దేశం నలుమూలల నుంచి నిరంతరాయంగా కాల్స్ ‌వస్తున్నట్లు చెప్పారు. ఆ ఫోన్‌ ‌నంబర్‌ను తాను 15 ఏళ్లుగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు వోటరు తొలగింపుకు సంబంధించి తాను ఎలాంటి దరఖాస్తు చేయలేదని వివరించారు. ప్రెస్‌ ‌బ్రీఫింగ్‌లో రాహుల్‌ ‌తన నంబర్‌ను ప్రస్తావించడం చూసి షాక్‌ అయినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అంజనీ మిశ్రా మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్‌ ‌టాపిక్‌గా మారింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *