హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: వరంగల్ జిల్లా దామెర మండలం పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్ తన కుటుంబంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది నవంబర్ 2న రైలులో రాజస్థాన్ వెళుతున్న సందర్భంలో కొందరు దుండగులు రాహుల్‌ను రైలులో నుంచి తోసేశారు. ఈ ఘటనలో అతను రెండు కాళ్లు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో అతనికి కృత్రిమ కాళ్లు అమర్చేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందించింది. సీఎం సహాయ నిధి ద్వారా చికిత్స అందించి కృత్రిమ కాళ్లను అమర్చేందుకు సాయం చేసిన ప్రభుత్వం తను మళ్లీ నడవగలిగేందుకు దోహదపడిరదంటూ రాహుల్ తన కుటుంబంతో సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





