– శంకుస్థాపనలు చేసిన మంత్రి వివేక్
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్30: మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం హైదరాబాద్ రహమత్ నగర్ లో పర్యటించారు. రహమత్ నగర్ డివిజన్ లో పర్యటించిన మంత్రి పార్టీ శ్రేణులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రహమత్ నగర్ డివిజన్ లోని ఇందిరాగాంధీ నగర్ లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్. రూ. కోటి 53 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి, అజారుద్దీన్, సీఎన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రహమత్ నగర్ డివిజన్ ఇందిరానగర్ ఫేజ్ 2 లో మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రూ. కోటి 30 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. రహమత్ నగర్ డివిజన్ ప్రతిభా నగర్ లో రూ. 99 లక్షల 50 వేలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బ్రహ్మశంకర్ నగర్‌లో కమ్యూనిటీ హాల్, సిసి రోడ్డు నిర్మాణానికి, రూ.కోటి 28 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు మంత్రి వివేక్ శంకుస్థాపన చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



