హరీష్‌ ‌రావు, రేవంత్‌ల ‌కుమ్మక్కు నిజమే

– గతంలోనే తాను ఈ విషయం చెప్పా
– ఇప్పుడు కవిత కొత్తగా చెప్పిందే లేదు
– పోచంపల్లి, నవీన్‌రావు అక్రమాలపై విచారణ జరపాలి
– విలేకర్లతో ఎంపి రఘునందన్‌ ‌డిమాండ్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: ‌రేవంత్‌రెడ్డి, హరీష్‌ రావు కుమ్మక్కయ్యారని తాను గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ రఘునందన్‌ ‌రావు అన్నారు. కవిత ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏం లేదని పేర్కొన్నారు. వాళ్ల పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడదల్చుకోలేదని తెలిపారు. కవిత చెప్పిన మోకిల ప్రాజెక్టు అవకతవకల గురించి విచారించాలని చెప్పారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్‌రావు చేసిన అక్రమాలపై విచారణ జరపాలన్నారు. జడ్పీ అధ్యక్షుడిగా నన్ను ఎవరు ఓడించారో గతంలో కేసీఆర్‌కు చెప్పాను. ఆరోజు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెదక్‌ ఎం‌పీ ఎన్నికల్లో ఇబ్బందిపెట్టాలని చూసినట్లు గతంలోనే చెప్పా. కవిత ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడితే బాగుండేది. ఆమె మాటలతో బీఆరెస్‌ అవినీతి పునాదుల  విస్తరించబడిందని తేలింది. మళ్లీ వొచ్చే ఎపిసోడ్‌లో బీఆరెస్‌పెద్దలు చేసిన అవినీతిని బయటపెడితే బాగుంటుంది. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రావు చేసిన అక్రమాలపై పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని రఘునందన్‌రావు కవితను ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌  తాజా పరిణామాల నేపథ్యంలో రఘునందన్‌ ‌రావు స్పందించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దుబ్బాకకు  కుటుంబం చేసిన అన్యాయం గురించి తాను అనేక సార్లు చెప్పానన్నారు. అలాగే దుబ్బాకకు హరీష్‌ ‌రావు వల్లే అన్యాయం జరిగిందని కూడా తాను ఆనాడే చెప్పానని తెలిపారు. బీఆర్‌ఎస్‌లో తాను ఓడిపోవడానికి కారణం ఏమిటో కూడా కేసీఆర్‌కు గతంలోనే చెప్పానన్నారు. ఒకే విమానంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి, హరీష్‌ ‌రావులు ప్రయాణం చేశారని తాను గతంలోనే చెప్పానని పేర్కొన్నారు. అయితే కవిత చెప్పిన దాంట్లో కొత్తదనం ఏ కనిపించడం లేదన్నారు. మోకిల్లాలో జరుగుతున్న విల్లా ప్రాజెక్ట్‌పై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ ‌చేశారు. అలాగే పోచంపల్లి శ్రీనివాస్‌ ‌రెడ్డి, నవీన్‌ ‌రావులపై వెంటనే ఏసీబీ డీజీతో విచారణ జరిపించాలని ‌ప్రభుత్వానికి సూచించారు. గతంలో నార్సింగి టాస్క్‌ఫోర్స్ ‌డీసీపీగా సందీప్‌ ‌రావు చేసిన అరాచకాలు చెప్పాల్సి ఉండేదన్నారు. సంతోష్‌ ‌రావు వియ్యంకుడి హోదాలో సందీప్‌ ‌రావు అనేక అరాచకాలు చేశారని వివరించారు. అతడి ద్వారానే సంతోష్‌ ‌రావు సెటిల్‌మెంట్లు చేసేవారన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *