– మావోయిస్ట్‌లతో చర్చలు జరపాల్సిందే
– సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు
సంగారెడ్డి, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 17: ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని మొదటి నుంచి సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తున్నదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. నిన్న నక్సలైట్ల పేరుతో బయటికి వచ్చిన లేఖ నిజమా ? కాదా అన్నది పక్కన పెడితే చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో వీర తెలంగాణ రైతాంగ పోరాట బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో పాల్గొన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేసి నక్సలైట్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న ఉత్సవాలు జరిపే అర్హత కాంగ్రెస్, బీజేపీ లకు లేదని ఆయన మండిపడ్డారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమన్నారాయన. తెలంగాణ సాయుధ పోరాటంలో అసలు బీజేపీ పార్టీ లేనేలేదన్నారు. బీజేపీ విమోచనం పేరుతో మోసం చేస్తుందని.. బీజేపీ, నైజాం విధానాలు ఒక్కటే…ఇద్దరు బ్రిటిష్ వారికి ఎజెంట్లుగా పని చేశారన్నారు. సాయుధ పోరాటంలో, ఇఓ పార్టీల నుంచి ఒక్కరైనా ఉన్నారా…ఆనాడు నైజాం భూ స్వాములని ప్రోత్సహిస్తే ఇప్పుడు కార్పొరేట్ శక్తుల్ని బీజేపీ ప్రోత్సహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



