– రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ముర్ము
న్యూదిల్లీ,సెప్టెంబర్ 10: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. ఈనెల 12వ తేదీన సీపీ రాధాకృష్ణన్ 15వ భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి చేత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అందుకోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ దన్‌ఖడ్ రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఆ క్రమంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను రంగలోకి దింపారు. అలాగే ప్రతిపక్ష ఇండి కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డిని బరిలో దింపారు. సెప్టెంబర్ 9వ తేదీన జరిగిన ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ 148 వోట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రాధాకృష్ణన్‌కు 452 వోట్లు రాగా.. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 వోట్లు పోలయ్యాయి. ఇక బీఆర్‌ఎస్, బీజేడీ, ఎస్‌ఎల్‌డీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.