న్యూదిల్లీ, సెప్టెంబర్ 9: భారత 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌కు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించి ఇవాళ ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన మీ జీవితం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర గవర్నర్‌గా మీరు అందించిన సేవలు గుర్తుండిపోతాయన్నారు. రాజకీయ, పరిపాలనా రంగంలో మీ నిబద్ధత, నిజాయతీకి, మీరు చేసిన ప్రజాసేవకు ఈ పదవి సరైన గుర్తింపు అని పేర్కొన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా, ఉపరాష్ట్రపతిగా దేశ రాజ్యాంగానికి మరింత వన్నెతెచ్చేలా మీ పదవీకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కిషన్‌రెడ్డి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.