– రాధాకృష్ణన్ ఎన్నిక ఎన్డీయే ఐక్యత, ప్రజల నమ్మకానికి ప్రతిబింబం
– ఎంబీసీ సామాజిక వర్గంతోపాటు దేశమంతా గర్వించే ప్రతినిధి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీ.పి.రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో చరిత్రాత్మక విజయాన్ని సాధించడంపట్ల ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పహృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్డీయే ఐక్యత, దేశ సమగ్ర అభివృద్ధికి గొప్ప సంకేతంగా నిలిచిందన్నారు. రాధాకృష్ణన్ ప్రజల సంక్షేమం, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక ఐక్యత కోసం నిరంతరం కృషిచేస్తున్నారని, ఉప రాష్ట్రపతిగా ఆయన ప్రభావవంతంగా సేవలందిస్తారని గర్వంగా విశ్వసిస్తున్నామని అన్నారు. రాధాకృష్ణన్ ఎంబీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, దేశ ప్రజల సంక్షేమం, సమాజ సమన్వయానికి నిత్యం కృషి చేస్తున్నారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



