– ఉరేసుకుని భార్య ఆత్మహత్య
జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 13: కోరుట్ల పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. అప్పు చెల్లింపు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగగా, రమ్య సుధ (36) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆదర్శనగర్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్న భర్త శ్రీధర్ భార్య రమ్యసుధ వరంగల్ జిల్లా రాయపర్తి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నది. బట్టల వ్యాపారం సరిగా లేక, ఇంటి నిర్మాణం కోసం అప్పులు ఎక్కువైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంక్రాంతి సెలవులు రావడంతో రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన భార్య.. అప్పుల విషయంలో నిలదీయడంతో దంపతుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో రమ్య సుధ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లుడి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు పిర్యాదు చేసిన తల్లిదండ్రులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



