క్వాంటం సిటీగా హైదరాబాద్‌

– దేశంలోనే తొలిసారిగా లాంగ్‌ టర్మ్‌ క్వాంటం స్ట్రాటజీ
– స్టార్టప్స్‌, ఇన్నోవేషన్స్‌ కోసం ప్రత్యేకంగా ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: క్వాంటం సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. క్వాంటం టెక్నాలజీ లో తెలంగాణను గ్లోబల్‌ లీడర్‌గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా లాంగ్‌ టర్మ్‌ క్వాంటం స్ట్రాటజీని రూపొందించామన్నారు. గచ్చిబౌలిలోని ఐఐఐటీ హైదరాబాద్‌లో నీతి ఆయోగ్‌ రోడ్‌ మ్యాప్‌ ఫర్‌ క్వాంటం- తెలంగాణ క్వాంటం స్ట్రాటజీని గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పట్లో విద్యుత్‌, ఇంటర్నెట్‌ వంటి ఆవిష్కరణలు ప్రపంచం రూపురేఖలు మార్చాయన్నారు. అదే తరహాలో రాబోయే రోజుల్లో క్వాంటం టెక్నాలజీ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతుందన్నారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ తదితర కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీస్‌లో తెలంగాణను గ్లోబల్‌ లీడర్‌గా మార్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.‘లాంగ్‌ టర్మ్‌ క్వాంటం స్ట్రాటజీలో భాగంగా రీసెర్చ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సైబర్‌ సెక్యూరిటీ, లైఫ్‌ సైన్సెస్‌ యాక్సిలరేషన్‌, టాలెంట్‌ పైప్‌లైన్‌ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. క్వాంటం సెన్సింగ్‌, సెక్యూరిటీ, కమ్యూనికేషన్‌, క్వాంటం కంప్యూటింగ్‌లో ఆర్‌అండ్‌ డీ, ఇన్నోవేషన్స్‌ను ప్రోత్సహించేలా రూపొందించిన ఈ పాలసీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్‌ మోడల్‌గా నిలుస్తుందన్నారు. ఇది తమ ప్రభుత్వం రూపొందించిన ఒక పాలసీ మాత్రమే కాదని, క్వాంటం టెక్నాలజీలో దేశానికి దిశా నిర్దేశం చేసే డైరెక్షన్‌ అని అన్నారు. ఈ టెక్నాలజీలో దేశానికి ఒక బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేసేలా ప్రత్యేకంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌కు కూడా శ్రీకారం చుట్టామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్టార్టప్స్‌, కొత్త ఆలోచనలకు భరోసానిచ్చేలా ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌ను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీ డే పేరిట ప్రతి వారంలో ఒక రోజు అధికారులు, ప్రతి నెలలో ఒక రోజు సంబంధిత మంత్రి పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతారన్నారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం, సభ్యులు డాక్టర్‌ వీకే సారస్వత్‌, దేబ్‌ జానీ ఘోష్‌, స్పెషల్‌ సీఎస్‌ సంజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *