నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

– మేడారం పనులు గడువులోగా పూర్తికావాల్సిందే
– సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సీతక్క

మేడారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సోమవారం పరిశీలించారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గద్దెల పునరుద్ధరణ, అభివృద్ధి, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, రాతి స్తంభాల స్థాపన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క వెంట భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, ములుగు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కల్యాణి ,పూజారులు, పార్టీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *