– ఆయన సేవలు చిరస్మరణీయం
– రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం
హైద్రాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : మాజీ ప్రధాని, భారతరత్న, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు భారత దేశానికి అందించిన మహనీయ సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పీవీ వర్ధంతి సందర్భంగా పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన అయిదేళ్ల పాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని, పీవీ విధానాలు, మార్గదర్శకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అవసరం మనపై ఉందని అన్నారు. ఆర్థిక అంశాల్లో దేశం ఈరోజు నిలబడిరదంటే ఆయన చేసిన సంస్కరణలు నిదర్శనమన్నారు. వారి సంస్కరణలతో ప్రపంచలో మాంద్యం వచ్చినా, కరోనా లాంటి విపత్తు వచ్చినా దేశం బయటపడి స్వయంగా నిలదొక్కుకుందపి పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి జ్ఞాన్ భూమిలో పివీ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. పి.వి తెచ్చిన సంస్కరణలు. ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. అలాగే ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఇటు రాష్ట్రానికి, అటు దేశానికి విలువైన సేవలందించారని కొనియాడారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం తరపున ఆయన సమాధి వద్ద ఘన నివాళులర్పించామన్నారు. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ సలహాదారులు హర్కార వేణుగోపాల్, రాజ్యసభ మాజీ సభ్యుడు కెేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పీవీ కుటుంబ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్‌లు, ఇతర ముఖ్య నేతలు పీవీకి నివాళులర్పించారు.
———————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





