ఇగోలు పక్కనపెట్టి పనిచేయండి

– ఒక్కొక్కరు మరో పదిమంది లీడర్లను తయారు చేయాలి
– మార్షల్ ఆర్ట్స్  ‌రూపంలో క్లాస్‌ ‌చెప్పిన రాహుల్‌ ‌గాంధీ
– రాహుల్‌ను ప్రత్యేకంగా కలిసిన మంత్రి సీతక్క

వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2: ఇగోల కంటే పార్టీ ముఖ్యమని రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు.. మరో పదిమందిని తయారు చేయాలని, పనిచేస్తున్న వారిని గుర్తించాలని రాహుల్‌ ‌గాంధీ సూచించారు. ఇండియా ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐసీసీ అగ్రనేత వివరించారు. అనంతగిరి హరితా రిసార్టస్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్షల్‌ ఆర్టస్ ‌చేస్తూ డీసీసీ అధ్యక్షులకు క్లాస్‌ ‌చెప్పారు రాహుల్‌. ‌జియు జిట్సు అనే మార్షల్‌ ఆర్ట్‌లో మెళకువలను డీసీసీ అధ్యక్షులకు వివరించారు. మార్షల్‌ ఆర్ట్స్ ను వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ ఐడియాలజీపై క్లాస్‌ ‌చెప్పారు. నాయకులు తమ అహంకారాన్ని పక్కన పెట్టి పని చేయాలని రాహుల్‌ ‌సూచించారు. పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇస్తోందని.. ఇరాన్‌ ‌వెనక చైనా, రష్యా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మోదీ పూర్తిగా సరెండర్‌ అయ్యారని.. ట్రంప్‌కు వ్యతిరేకంగా మోదీ పని చేయలేరని రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యానించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులు ముగియడంతో  వికారాబాద్‌ ‌నుంచి హెలికాప్టర్‌లో శంషాబాద్‌ ‌వెళ్ళారు. అక్కడి నుంచి ఏఐసీసీ అగ్రనేత ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఇదిలావుంటే లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ ‌గాంధీ వికారాబాద్‌ ‌పర్యటన సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌, ‌గ్రాణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. వికారాబాద్‌ ‌జిల్లా అనంతగిరి కొండల్లోని హరిత రిసార్టస్‌లో తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌డీసీసీ అధ్యక్షుల 10 రోజుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి రాహుల్‌ ‌గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆయనతో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు,ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలిసింది.

రాహుల్‌ను ప్రధాని చేయడమే మన కర్తవ్యం: సిఎం రేవంత్‌

రాహుల్‌ ‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశం కోసం రాహుల్‌ ‌ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం మనమంతా కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మోడీ వల్ల దేశానికి తీరని నష్టం జరుగుతోందన్నారు. రాషహుల్‌ ‌ప్రధాని అయితేనే దేశానికి క్షేమమని అన్నారు. వికారాబాద్‌ ‌వేదికగా తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా ముగింపు సమావేశం సోమవారం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీతోపాటు సీఎం రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో తానెప్పుడూ పైరవీలు చేయలేదన్నారు. గతంలో ప్రజాసమస్యలపై గళం విప్పిన తనపై కేసులు నమోదు చేశారని గుర్తు చేసుకున్నారు. ఆదివారం సైతం తాను కోర్టుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఈ 19 ఏళ్లలో జడ్పీటీసీ నుంచి తాను సీఎం అయ్యానని గుర్తు చేసుకున్నారు. ఆ క్రమంలో పార్టీ పదవులు సైతం నిర్వహించానని చెప్పారు. ఎమ్మెల్యేగా తాను మంచి అనుభవం పొందానన్నారు. తనపై అనేక కేసులు పెట్టారని.. పరువు నష్టం దావాలు కూడా వేశారని పేర్కొన్నారు. దేశం కోసం, తమ కోసం రాహుల్‌ ‌గాంధీ ప్రధాని కావాలని పేర్కొన్నారు. సోనియా గాంధీ పేరుతోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని వివరించారు. ఐదేళ్లు చేసిన పోరాటాల వల్ల రాహుల్‌ ‌గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారని వివరించారు. దేశం కోసం రాహుల్‌ ‌గాంధీ ప్రధాని కావాలన్నారు. దేశంలో అనేక సమస్యలపై రాహుల్‌ ‌గాంధీ పోరాటం చేశారని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఇచ్చిన నేతగా సోనియా పేరు చిరస్తాయిగా ఉంటుందని అన్నారు. త్యాగాలు చేసిన కుటుంబం వారిదని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *