అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

– కొనుగోళ్లు లేక మక్కల రైతుల ఆందోళన
– మాజీ మంత్రి హరీష్‌ ‌రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 4: రాష్ట్రంలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. రైతుల గురించి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రైతన్నలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు కాంగ్రెస్‌ ‌పాలనలో కష్టాలు తప్పడం లేదన్నారు. షాపుల్లో ఇవ్వాల్సిన యూరియా యాపుల్లో ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన రేవంత్‌ ‌సర్కార్‌ ‌విఫలమయ్యిందని విమ‌ర్శించారు. కోతల దశకు వచ్చినా పంట పెట్టుబడి సాయం ఇవ్వలేని దుస్థితికి చేరిందని పేర్కొన్నారు. కనీసం పండించిన పంటైనా అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ అదే నిర్లక్ష్యం, వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంద‌న్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఆరేపల్లి (అక్కెనపల్లి) గ్రామంలో సుమారు 350 ఎకరాల్లో మక్క సాగు చేస్తున్న రైతులు ప్రతి ఏటా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. దీంతో రైతులు ప్రైవేట్‌ ‌వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోందని అన్నారు. అనేక జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమవడం, అసలు ఏర్పాటు చేయకపోవడం, చెల్లింపులు ఆలస్యం కావడం, రవాణా సదుపాయాల లేమి వంటి సమస్యలు రైతులను ఆర్థికంగా కుదేలు చేస్తున్నాయని హరీష్‌రావు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర చెల్లించి మక్కలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *