నిందితులను కఠినంగా శిక్షిస్తాం

– దర్యాప్తు సంస్థలు వేగంగా పనిచేస్తున్నాయి
– కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ‌వెల్లడి

న్యూదిల్లీ,నవంబర్‌11: ‌దిల్లీలోని ఎర్రకోట కారు పేలుడు ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌స్పందించారు. పేలుడు ఘటనపై భద్రతా, దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ చేస్తున్నాయని, నిందితులను కఠినంగా శిక్షిస్తాం అని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌హా ఇచ్చారు. ఈ చర్యను శాంతికి భంగం కలిగించే పిరికి ప్రయత్నంగా పేర్కొన్నారు. దిల్లీలో మంగళవారం  డియా సమావేశంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు. ‘ఎర్రకోట కారు పేలుడు ఘటనపై దేశంలోని భద్రతా, దర్యాప్తు సంస్థలు సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నాయి. దర్యాప్తు వివరాలు త్వరలోనే వెల్లడిస్తాము. నా దేశ ప్రజలకు హా ఇస్తున్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ పేలుడుకు బాధ్యులను వొదిలిపెట్టం. నిందితులను కఠినంగా శిక్షిస్తాం. బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది’ అని రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌చెప్పారు. దిల్లీ పోలీస్‌ ‌స్పెషల్‌ ‌సెల్‌, ‌నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీతో సహా పలు ఏజెన్సీలు దర్యాప్తులో భాగం కానున్నాయి. దిల్లీ పేలుడు ఘటనపై దేశంలోని దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని.. త్వరలో ప్రమాదానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌వెల్లడించారు. దాడికి కారణమైనవారిని వొదిలిపెట్టమని.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా అధ్యక్షతన మంగళవారం కీలక సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ భేటీ ప్రారంభమైంది. హోం కార్యదర్శి గోవింద్‌ ‌మోహన్‌, ఇం‌టెలిజెన్స్ ‌బ్యూరో డైరెక్టర్‌, ‌జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్‌ ‌జనరల్‌, ‌దిల్లీ పోలీస్‌ ‌కమిషనర్‌, ఇతర సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా జమ్మూ కాశ్మీర్‌ ‌డీజీపీ, కేంద్ర పాలిత ప్రాంతం ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దిల్లీ పేలుడిపై ప్రాథమికంగా అందిన సమాచారం, ఉగ్ర సంస్థల ప్రమేయం, భారీ కుట్రపై సక్షిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *