– ఫలితాల తర్వాత నిజామాబాద్ పేరు మార్పు ఖాయం
– బీజేపీని అడ్డుకోవడానికి ఎంఐఎం కుట్రలు
– బీసీలను మోసం చేసిన రేవంత్
– రాహు-కేతువుల నుంచి రాష్ట్రాన్ని కాపాడే శక్తి బీజేపీకే ఉంది
– ఎన్నికల ప్రచారంలో రామచందర్‌రావు
ఇందూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన చూస్తుంటే ఇందూరులో బీజేపీ విజయం ఖాయమనే విశ్వాసం మరింత పెరుగుతోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ప్రజల తీర్పు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందని, దాంతో 13వ తేదీ ఫలితాల తర్వాత నిజామాబాద్ పేరు ఇందూరుగా మారడం ఖాయమని అన్నారు. ఇందూరులో జరిగిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఇదే గడ్డపై గతంలో అక్బరుద్దీన్ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారు.. 15 నిమిషాలు పోలీసులను పక్కనపెడితే ఏమవుతుందో చూడండంటూ వ్యాఖ్యానించారు.. వారికి 15 నిమిషాలు కావాలేమో.. కానీ హిందువులు తలుచుకుంటే పోలీసులున్నా లేకపోయినా తమకు 15 సెకన్లు చాలని హెచ్చరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ పట్ల పెరుగుతున్న ప్రజాదరణను అడ్డుకోవడానికే బీఆర్ఎస్-కాంగ్రెస్‌కి మధ్యవర్తిత్వం చేస్తూ ఎంఐఎం కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్‌కు ఓటు వేసినా కాంగ్రెస్‌కు వేసినా అది ఎంఐఎంకే వేసినట్టేనన్నారు. మరోసారి నిజాం పాలన తేవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ గతంలో కేసీఆర్ ఒక వర్గం ఓట్ల కోసం నిజాం మంచి పాలకుడని పొగిడారు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముస్లిం ఈజ్ కాంగ్రెస్.. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అని బహిరంగంగా ప్రకటించారని ఆరోపించారు. బీసీలకు సరైన ప్రాధాన్యం కల్పించకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. బీసీలు, రైతులు, యువత, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన డిక్లరేషన్లన్నింటినీ కాంగ్రెస్ మర్చిపోయిందని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తున్న పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి మతోన్మాదా.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్‌తో పాలన అందిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వమా అనేది సమాధానం చెప్పాలన్నారు. కులం, మతం, వర్గం అనే భేదాలు లేకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ సుపరిపాలన అందిస్తున్న ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదేనన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పట్టణాల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతున్నాయని రామచందర్‌రావు తెలిపారు.
డబ్బులు లేవని మున్సిపాలిటీలను ఎలా అభివృద్ధి చేస్తారు
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఎలా అభివృద్ధి చేస్తారు అని ప్రశ్నించారు. ప్రజలపై పన్నులు భారం వేయడమే కాంగ్రెస్ కుట్ర అని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా మారిందని, అందుకే ఈ ప్రభుత్వానికి చరమగీతం పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్‌గా, మజ్లిస్‌గా, మావోయిస్టు ఆలోచనలతో పనిచేసే పార్టీగా మారిందని ఆరోపించారు. అందుకే దేశ భద్రతకు ముప్పుగా మారిన కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాలన్నారు. గత బీఆరఎస్ ప్రభుత్వం ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చింది.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలను దోచుకుంటోంది అన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రాహువైతే, కేసీఆర్ కేతువు. ఈ రాహు-కేతువుల నుంచి తెలంగాణను కాపాడగల శక్తి ఒక్క బీజేపీకే ఉందని రామచందర్‌రావు స్పష్టం చేశారు. ప్రజలకు రక్షణ, సుపరిపాలన, అభివృద్ధి కావాలంటే బీజేపీతోనే సాధ్యమని, అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ¾ని గెలిపించాలని కోరుతున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





