నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగసంస్థలను సమీక్షించాలి

– సింగరేణికి సంబంధించి సూచనలు చేసిన కాగ్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి30: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలపాలు, లాభ నష్టాలపై కాగ్‌ ‌నివేదిక విడుదల అయింది. 2023 మార్చి వరకు పబ్లిక్‌ ‌సెక్టార్‌ ‌పనితీరుపై కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటింగ్‌ ‌జనరల్‌ ‌కాగ్‌ ‌కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వరంగ సంస్థలకు కాగ్‌ ‌పలు సిఫారసులు చేసింది. నష్టాల్లో ఉన్న కంపెనీల పనితీరుని సమీక్షించాలని సూచించింది. నష్టాల్లో ఉన్న కంపెనీలను ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదా పూర్తిగా మూసివేయడం చేయాలని పేర్కొంది. అలాగే సింగరేణి కంపెనీకి కూడా పలు సూచనలు చేసింది. ఓబీఆర్‌ ‌కాంట్రాక్టుల్లో భద్రతా నిబంధనలు మార్చాలని, బొగ్గు రవాణా ఛార్జీలను సక్షించాలని సూచించింది. తవ్విన గనులను తిరిగి నింపడానికి నది ఇసుకకు బదులు ప్రాసెస్‌ ‌చేసిన బూడిద లేదా గనుల ఉపరితల పదార్థాలను వాడాలని తెలిపింది.రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్టు, వాటిలో 16 సంస్థలు మూతపడినట్టు లేదా లిక్విడేషన్‌లో ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. మిగిలిన 67 సంస్థల్లో 49 ఖాతాలు సమర్పించడంలో ఆలస్యం చేశాయని పేర్కొంది. దీంతో కేవలం 18 సంస్థల పనితీరే విశ్లేషణకు తీసుకున్నట్టు కాగ్‌ ‌వెల్లడించింది. విశ్లేషణకు తీసుకున్న 18 సంస్థల్లో 11 నష్టాల్లో ఉన్నాయని, కేవలం 6 సంస్థలు మాత్రమే లాభాల్లో ఉన్నాయని కాగ్‌ ‌తెలిపింది. తొమ్మిది సంస్థల నెట్‌ ‌విలువ పూర్తిగా నష్టాలతో కరిగిపోయినట్టు వెల్లడించింది. 71 సంస్థలు సమయానికి ఖాతాలు సమర్పించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. 15 సంస్థల్లో 9 స్వతంత్ర డైరెక్టర్ల నియామకం చేయలేదని, ఎక్కడా ఇండిపెండెంట్‌ ‌డైరెక్టర్ల సమావేశాలు నిర్వహించలేదని పేర్కొంది. 5 సంస్థల్లో ఆడిట్‌ ‌కమిటీ లేదని, 9 సంస్థల్లో ఎన్‌ఆర్‌సీ కమిటీ ఏర్పాటు కాలేదని తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *