– కేసీఆర్ ఇష్టానుసారం కాళేశ్వరం నిర్మాణం
– ఏటీఎంలా ప్రాజెక్టును వాడుకున్నారు
– ఐదు మండలాలపై నాడు నోరు మెదపలేదు
– అవినీతిపై కేసీఆర్‌ను జైలుకు పంపుతామన్న కాంగ్రెస్
– రాజ్యసభలో సురేష్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
న్యూదిల్లీ, ఏప్రిల్ 2: రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారింద ని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగాయని, కాళేñశ్వరం వల్ల ఉగయోగం లేదని నివేదికలు చెప్పాయని తెలిపారు. కాళేశ్వరం ప్రజల డబ్బుతో కట్టారా? లేక కేసీఆర్ సొంత డబ్బుతో కట్టారా అంటూ ప్రశ్నించారు. రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి నిధులు తీసుకొని కాళేశ్వరం నిర్మించారని మంత్రి తెలిపారు. భద్రాచలంలో ఉన్న గ్రామాలు ఏపీ పునర్విభజన చట్టంలో చేర్చారని, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. విలీనం తర్వాత కూడా ఆయన సోనియాగాంధీ ఇంటికి వెళ్లారని తెలిపారు. ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని కాంగ్రెస్ చెప్పిందని, ఆయనపై ఎందుకు విచారణ జరపలేదని కిషన్ రెడ్డి నిలదీశారు. ఈ క్రమంలో కాళేశ్వరం అంశంపై రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ సురేశ్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై సురేశ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన తన వ్యాఖ్యలను ఉసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సురేశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. మేడిగడ్డ పనికి రాకుండా పోవడానికి బీఆర్ఎస్ కారణమని, ఇదే విషయాన్ని నిపుణుల కమిటీ కూడా చెప్పిందని అన్నారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ కుటుంబం ఓ ఏటీఎంలా వాడుకుందని, ఇంజినీర్లను కూడా అడగకుండా ప్రాజెక్టు చేపట్టారని విమర్శించారు. రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేశారని పునరుద్ఘాటించారు.
————————————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





