17‌న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

– ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్‌ ‌రామకృష్ణారావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 9: ఈ ‌నెల 17న నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఏర్పాట్లపై అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో ఉన్నతాధికారుల సమావేశం మంగళవారం జరిగింది. సమావేశానికి హోమ్‌ ‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవీ గుప్తా, డీజీపీ డా. జితేందర్‌, ‌పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌ ‌కుమార్‌, ‌హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కషనర్‌ ‌సీవీ ఆనంద్‌, ఇం‌టలిజెన్స్ అడిషనల్‌ ‌డీజీ  శివధర్‌ ‌రెడ్డి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ ‌మిట్టల్‌, ‌జీఏడీ కార్యదర్శి రఘునందన్‌ ‌రావు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సి.ఎస్‌. ‌రామకృష్ణారావు మాట్లాడుతూ, ఈనెల 17 తేదీన ఉదయం గన్‌పార్క్ ‌లోని అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్‌ ‌గార్డెన్‌ ‌లో జరిగే ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొంటారని వివరించారు. గన్‌పార్క్ ‌వద్ద జరిగే కార్యక్రమానికి జీ.హెచ్‌.ఎం.‌సి కషనర్‌ ‌నోడల్‌ అధికారిగా ఉంటారని, గన్‌పార్క్ ‌కు ప్లోరల్‌ ‌డెకరేషన్‌ ‌తో పాటు, షామియానా తదితర ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా నగరంలోని అని ప్రధాన కార్యాలయాలు, విగ్రహాలు, పర్యాటక ప్రదేశాలను విద్యుత్‌ ‌దీపాలతో అలంకరించాలని అన్నారు. పబ్లిక్‌ ‌గార్డెన్‌లో నిర్వహించే సమావేశానికి తగు ఏర్పాట్లను చేపట్టాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా జరిగేలా చూడాలని సి.ఎస్‌ అధికారులను ఆదేశించారు. నిరంతర  విద్యుత్‌ ‌సౌకర్యం కల్పించడంతోపాటు తగు తాగునీరు, శానిటేషన్‌ ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి వీవీఐపీలతోపాటు ప్రజాప్రతిధులందరికీ ఆహ్వాన పత్రికలను అందచేయాలని ఆదేశించారు. సమావేశానికి ఫైర్‌ ‌సర్వీసుల డీజీ నాగిరెడ్డి, మున్సిపల్‌ ‌శాఖ కార్యదర్శి ఇలంబర్తి, ప్రోటోకాల్‌ ‌శాఖ డైరెక్టర్‌ ‌శివలింగయ్య, హైదరాబాద్‌ ‌కలెక్టర్‌ ‌హరిచందన, సమాచార శాఖ స్పెషల్‌ ‌కషనర్‌ ‌ప్రియాంక, ఎస్‌.‌పి.డీసీ.ఎల్‌ ఎం‌డి ముష్రారఫ్‌, ‌జలమండలి ఎండి అశోక్‌ ‌రెడ్డి తదితర అధికారులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *