– కులగణన చేపట్టాం
– రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉంది
– కోర్టుల ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలు జరుపుతున్నాం
– కొత్తగూడెంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు
– కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
– వైరా ఎన్ఎస్పి కాలువకు గోదావరి నీళ్లు
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రేమ, దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీకి లేదని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నూతి సత్యనా రాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన చేపడతామని మా నాయకుడు రాహుల్ గాం ధీ ఇచ్చిన హామీ మేరకు దేశంలో ఎక్క డా లేనివిధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సర్వే నిర్వహించాం, అసెంబ్లీ లో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ కు పంపాం, బిల్లు అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లింది. ఇబ్బందులతో రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లు ఆగిపోయిందన్నారు. బిల్లును ఆమో దింప చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళాం ధర్నా చేశాం ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశామని ఆయన వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టుల ఆదేశిస్తుండడంతో గ్రామపంచాయతీ ఎన్నిక లకు వెళ్లాం. బలహీన వర్గాలకు పార్టీ పరం గా కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆ యన హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని పూర్తిస్థాయి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని కొత్త గూడెంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించబోతు న్నామని ఆయన తెలిపారు. ఆర్థిక సంస్కర ణలతో దేశాన్ని ప్రపంచ పటంలో ముందు ఉంచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధా ని మన్మోహన్ సింగ్ పేరిట యూనివర్సిటీని నెలకొల్పామని డెప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తలెత్తుకొని నిలబడేలా రూపొందించిన విజన్ డాక్యుమెంట్ చూసేం దుకు ఈనెల 10 నుంచి 13 వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు వచ్చి పాలుపంచుకోవాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయాలు ప క్కన పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదిం వండి, గెలిపించుకోండి ప్రతి గ్రామాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందామని ఆయన రా ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు ౦చ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి గానే ఒక్కో ఇంటికి ఐదు లక్షల చొప్పున ఖర్చు చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మొదటి సంవత్సరం నియోజకవ ర్గానికి 3500 ఇళ్ల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా రూ.22 వేల కోట్లు ఖర్చు చేసి నాలుగున్నర లక్షల ఇళ్ళు నిర్మిస్తున్నామని వివరించారు. ఐ మ లక్షలతో ఇల్లు నిర్మించడం ఇతర పాలకు లతో సాధ్యం కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ అధి కారంలో ఉండబట్టే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది అని అన్నారు. రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తు న్నాం దేశంలోనే ఈ పథకం ఎక్కడ అమలు కావడం లేదు. ప్రతినెలా ఒక్కో మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తు న్నాం. ఇందుకు గాను ప్రభుత్వ ఖజానాపై రూ.13, 500 కోట్ల భారం పడుతున్నా పేదల కో సం ప్రజా ప్రభుత్వం వెనక్కి తగ్గదు అని తెలిపారు. ఇందిరా క్రాంతి పదం పథకం కింద ప్రతి సం వత్సరం మహిళలకు రూ.20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటిస్తే ఇది అసా వ్యమని ఆనాడు హేళన చేశారు. కానీ మేము మొదటి సంవత్సరం రూ.26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు పంపిణీ చేసి అసా ధ్యాన్ని సుసాధ్యం చేశామన్నారు. ఆర్ధిక భారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు కోటిమంది మహిళలకు ఇంటిం టికి సారే పంపిణీ చేశామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించామని, రాష్ట్రంలో 51 లక్షల కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్తు సరఫరా చేస్తున్నామని, రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు రూ.12 వేల ఆర్థిక సహాయం చేస్తున్నాం.. తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని డిప్యూటీ సీఎం తెలిపారు. రెండు లక్షల వరకు రుణమాఫీ ద్వారా రూ.21 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని డిప్యూటీ సీ ఎం తెలిపారు. రైతులకు పంటలకు బీమా సౌకర్యం కల్పించాం పంట నష్టం జరిగితే ఎక రాకు 10000 చొప్పున రైతులకు అందించామని, కేవలం సంక్షేమ పథకాల కోసమే 1.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. రైతులకు ఉచితంగా 24 గంట ల కరెంటు ఇస్తున్నాం. రాష్ట్రంలో 29 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్తు అందించి 12,500 కోట్ల ఆర్థిక భారాన్ని రైతుల పక్షాన ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నామన్నారు. పాలమూరు రంగారె డ్డి ఎత్తిపోతల పథకాన్ని నెలనెలా సమీక్షిస్తున్నామని, రీ డిజైన్ పేరుతో ఇందిరా సాగర్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పూర్తి చేయలేదు ..కానీ మా ప్రభుత్వం రాగానే రూ.100 కోట్లు కేటాయించి రాజీవ్ లింకు కెనాల్ ద్వారా వైరా ఎన్ఎస్పి కాలువకు కలిపి గోదా వరి నీళ్లు పారిస్తున్నామని, రెండో దశలో సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గం గోదావరి నీటిని పారించేందుకు భూ సేకరణ జరుపుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రపంచంతో పోటీపడేలా 2047 తెలంగాణ రైసింగ్ డాక్యుమెంట్ను ఈ నెల 9న ఆవిష్కరి స్తున్నామని తెలిపారు. మూడు ట్రిలియన్ డాల ర్ల ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిది ద్దేందుకు భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉంటుందో వివరించనున్నట్లు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన నూతి సత్యనారాయణ బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి కావడమే కాదు వారి కుటుంబం స్వతంత్ర సమరయోధుల కుటుంబమని డిప్యూటీ సీఎం తెలిపారు. నూతి సత్యనారాయణ తండ్రి నూతి అనంత రాములు తెలంగాణ సాయుధ పోరా టంలో నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరా డారు, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక ప్రశంసా పత్రాలు పొందారని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో అన్ని వసతులతో కూడిన ఆధునిక కాంగ్రెస్ కార్యాలయం నిర్మాణానికి తెలంగాణ క్యాబినెట్ ఎకరం స్థలం కేటా యించింది. ఈ స్థలానికి చెల్లించాల్సిన డబ్బుల ను కాంగ్రెస్ కార్యాలయం నుంచే మాజీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ చెక్కు రూపంలో కలె క్టర్ కు డబ్బులు చెల్లించారని తెలిపారు. నూత న కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణానికి సంబం ధించి నాయకులందరినీ భాగస్వాములుగా చేస్తాం అతి త్వరలో నిర్మాణ కమిటీని ప్రకటి స్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




