ప‌క్షుల మ‌నుగ‌డ‌ను, ప్ర‌కృతినీ కాపాడుకుందాం

– డాక్టర్ అనితా రెడ్డి

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః జాతీయ‌ పక్షుల దినోత్సవం సందర్భంగా పక్షులను కాపాడుకుందాం ..ప్రకృతిని కాపాడుదాం అనే అంశంపై కాలనీ వాసులు, విద్యార్థులకు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ చైర్‌ప‌ర్స‌న్‌, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి సోమ‌వారం అవ‌గాహ‌న క‌ల్పించారు. ఇంటి ఆవరణలో పక్షులకు చిరు ధాన్యాలు వుంచుదాం.. నీటి చిప్పలను, చిన్నపాటి గూడుల ఏర్పాటు చేసి వాటికి సేదతీర్చుదాం అని పిలుపునిచ్చారు. ప్రకృతి సేవ దైవ సేవ.. అని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఇండ్ల ఆవరణలో కట్టడానికి కొందరికి పిట్ట గూళ్లు, గింజలు ఆమె పంపిణీ చేశారు. అడవులు అంతరించి పోవడాలు, వ్యవసాయం తగ్గడంతో పక్షులు అంతరించి పోతున్నాయని, వాటిని కాపాడుకోవడం అందరి భాధ్యత అని అన్నారు, ఇదివరకు ప్రతి ఇంటి లో మనం ఊరపిచుకలను చూసేవారం.. ఇప్పుడు ఆ వాతావరణం లేదు. ఇంటి చెట్టపై రకరకాల పక్షులను చూసేవారం.. ఇప్పుడు ఇంటి ఆవరణలో చెట్లు కరవయ్యాయి. ఇలా వలస పక్షులు సరైన వాతావరణం లేక కనుమరుగవుతున్నాయని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, ప్రకృతి సేవ విశ్వమానవ సేవ అన్నారు ప్రకృతిని కాపాడటం అంటే మన ఆయుష్షును పెంచుకోవడం.. భవిష్యత్తుతరాలకు ఆరోగ్యకర మైన సమాజాన్ని అందించడమే అన్నారు, పక్షులు మన జీవితం లో భాగంగా ఉండాలని, వాటి మనుగడకు ముప్పురాకుండా చూడడం, వాటిని సంరక్షించ‌డం ప్రతి ఒక్కరి బాధ‌త అని ఆమె చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *