– అధికారులను ఆదేశించిన సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ఈమేరకు సచివాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు పూర్తిస్థాయిలో తగు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పలుమార్లు డేటా సెంటర్ల ఏర్పాటుపై సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేశారన్నారు. డేటా కేంద్రాల ఏర్పాటుకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లతోపాటు ఉత్తరప్రదేశ్‌లో ఇస్తున్న రాయితీలపై చర్చించారు. డాటా సెంటర్ల ఏర్పాటుకు 100 శాతం గ్రీన్ ఎనర్జీ సోర్స్ సౌకర్యం, కావాల్సిన విద్యుత్‌ను బహిరంగ సేకరణ ద్వారా పొందడం, డెడికేటెడ్ పవర్ సప్లై నెట్‌వర్క్ ఎస్‌జిఎస్‌టి రీ-ఇంబర్సుమెంట్ తదితర అభ్యర్థనలు డేటా సెంటర్ల ఇన్వెస్టర్ల నుంచి ఉన్నందున ఈ అంశాలపై అధ్యయనం చేయాలని సీఎస్ సూచించారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలతోపాటు అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. ఐటి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ కమిషనర్ శశాంక, ఐటి శాఖ ప్రత్యేక కార్యదర్శి భవేష్ మిశ్రా, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.