నీటిపారుదల శాఖలో 127మంది ఏఈఈలకు పదోన్నతులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 24: నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న 127 మంది ఏఈఈలు పదోన్నతులు పొందారు. పదోన్నతుల కోసం వీరి 18 ఏళ్ల నిరీక్షణకు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యంతో ఎట్టకేలకు తెరపపడిరది. ఈ మేరకు బుధవారం రాత్రి ఇంజినీరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి సంతోష్‌రెడ్డిల ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం మంత్రి ఉత్తమ్ కుమార్‌ను ఆయన కార్యాలయంలో కలసి కృతజ్ఞతలు తెలిపింది.





