*గ్రామాల్లో వేడుకలను తలపించిన ప్రారంభోత్సవాలు
*ఉత్సాహంగా పనుల జాతరలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు
*మహబూబాబాద్ జిల్లాలో పనుల జాతరను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క
*పనుల జాతరలో పాల్గొన్న శాసన సభాపతి డా. గడ్డం ప్రసాద్, మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ తదితరులు
*“మేము సైతం” అంటూ ఉత్సాహంగా పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
please subscribe our channel youtube.com/@prajatantra-news
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో “పనుల జాతర – 2025” శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వేడుకలను తలపించేలా ఈ కార్యక్రమాలు సందడిగా సాగుతున్నాయి. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడంతో పల్లెలో పండుగ వాతావరణంలో పనుల జాతర కొనసాగుతోంది. ఈ సందర్భంగా గత సంవత్సరం పనుల జాతరలో చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించగా, కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ దఫా పనుల జాతర కోసం ప్రభుత్వం రూ.2,198 కోట్లు కేటాయించగా, రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా అభివృద్ధి పనులు చేపట్టనుంది. పల్లెల్లో జీవనోపాధి, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, ఉపాధి సృష్టి వంటి రంగాల్లో పటిష్టమైన పునాది వేసేలా ఉపాధి హమీ నిధుల ద్వారా పనులు చేపడుతున్నారు. గ్రామ సభలు నిర్వహించి పారిశుధ్య కార్మికులను సన్మానించారు.





