గెస్ట్ ‌ఫ్యాకల్టీపై ప్రొఫెసర్‌ అత్యాచారం

– ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని జేఎన్టీయూలో దారుణం చోటుచేసుకుంది. గెస్ట్ ‌ఫ్యాకల్టీపై ఓ ప్రొఫెసర్‌ ‌లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే సామాజిక వర్గం అంటూ నమ్మించి మరీ బాధితురాలిని ప్రొఫెసర్‌ ‌వంచించాడు. ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ, భయపెడుతూ పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చివరకు బాధితురాలి కాపురాన్ని కూడా కూల్చేశాడు కీచక ప్రొఫెసర్‌. ‌వర్క్ ఉం‌దంటూ బాధితురాలిని అర్ధరాత్రి వరకు తనతోనే ఉంచుకునేవాడు. ‌దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో బాధితురాలు ఒంటరిగా ఉంటోంది. ఆమె ఒంటరితనాన్ని అవకాశంగా మలుచుకుని శారీరకంగా, మానసికంగా ప్రొఫెసర్‌ ‌మరింతగా వేధింపులకు గురిచేశాడు. తన ఛాంబర్‌లో కూడా బాధితురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. రోజు రోజుకూ ప్రొఫెసర్‌ ‌వేధింపులు అధికమవడంతో బాధితురాలు తీవ్ర మానసిక వేదనకు గురైంది. ‌వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ ‌చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రముఖ విశ్వ విద్యాలయంలో జరిగిన ఈ ఘటనపై విద్యార్థులు, ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.
———————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *