పిల్లల దత్తత ప్రక్రియ చట్టబద్దంగా జరగాలి

– డాక్టర్‌ అనితా రెడ్డి

హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: పసి పిల్లల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిశు గృహలో పిల్లల దత్తత ప్రక్రియ నిబంధనలననుసరించి చేయాలని అనురాగ్‌ హెల్పింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ మాజీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనితా రెడ్డి పేర్కొన్నారు. హన్మకొండలోని పసిపిల్లల ఆశ్రమం శిశు గృహను శుక్రవారం ఆమె  సందర్శించి పిల్లల బాగోగులు అడిగి తెలుసుకున్నారు, పసి పిల్లల సౌకర్యార్ధం లాక్టోజన్‌ పాల డబ్బాలను సిబ్బందికి అందించారు. శిశు గృహ మేనేజర్‌, సిబ్బందితో మాట్లాడుతూ ‘కారా’ చట్టం ప్రకారం నిబంధనలననుసరించి దత్తత జరుగుతుందని ఇప్పటికీ ప్రజలకు తెలియడం లేదని, త్వరగా అయిపోతుందని అక్రమ దత్తత వైపు మొగ్గు చూపుతున్నారని, అది చట్ట ప్రకారం నేరం, శిక్షార్హమని ఆమె అన్నారు. దీనిప్లై గ్రామస్ధాయి నుండి జిల్లాస్ధాయి వరకు అవగాహన కల్పించాల్సిన భాధ్యత అందరిపై ఉందన్నారు. అప్పుడే అక్రమ దత్తతలు ఆగుతాయని ఆమె అన్నారు, శిశు గృహాలలో వివిధ కారణాలతో ఉన్న పిల్లల ప్రాసెస్‌ కూడా వేగవంతం చేసి వారికి మంచి భవిష్యత్తును అందించాలన్నారు. ఏ సహాయసహకారాలు కావాలన్నా చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని డాక్టర్‌ అనితా రెడ్డి తెలిపారు, కార్యక్రమంలో శిశు గృహ మేనేజర్‌ మాధవి, చైతన్య, సిబ్బంది పిల్లలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *