సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా ప్రియాంక బాధ్యతల స్వీకరణ

ప్రస్తుత కమిషనర్‌ హరీష్‌కు ఘన వీడ్కోలు

 

హైదరాబాద్‌, జూన్‌ 16 :: సమాచార పౌర సంబంధాల స్పెషల్‌ కమిషనర్‌గా సిహెచ్‌. ప్రియాంక సోమవారం బాధ్యతలు  స్వీకరించారు. ఇప్పటివరకు ఆ శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా ఉన్న డాక్టర్‌ హరీష్‌ను తెలంగాణ జెన్కో ఎం.డిగా బదిలీ చేసి మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న ప్రియాంకను సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. సచివాలయంలో డాక్టర్‌ హరీష్‌ నుండి ఆమె ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ సెక్రటరీ, సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌తోపాటు తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎం.డిగా కూడా బాధ్యతలు  స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ప్రియాంకకు సమాచార శాఖ, ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, మీడియా అకాడమి అధికారులు అభినందనలు తెలిపారు. ఇదిలావుండగా జెన్కో ఎండీగా వెళ్తున్న డాక్టర్‌ హరీష్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. స్పెషల్‌ కమిషనర్‌గాబాధ్యతలు  స్వీకరించిన అనంతరం సమాచార శాఖ కార్యక్రమాలు, పనితీరుపై ప్రియాంక అధికారులతో సమీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *