దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె ప్రత్యేక్యంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీకి తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





