మళ్లీ బంద్‌ దిశగా ప్రైవేటు కాలేజీలు !

– ప్రభుత్వం హామీని నెరవేర్చనందుకే..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: మరోసారి బంద్‌ దిశగా రాష్ట్రంలోని ప్రైవేట్‌ కాలేజీలు అడుగులు వేస్తున్నాయి. ఫీజు బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఈ నెల 6 నుంచి బంద్‌ పాటించాలని ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు పిలుపునిచ్చాయి. ఈమేరకు ఫెడరేషన్‌ అఫ్‌ అసోసియేషన్స్‌ అఫ్‌ తెలంగాణ హయ్యర్‌ ఎడ్యుకేషన్స్‌ ఆధ్వర్యంలో అన్ని ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. పెండిరగ్‌ బకాయిలపై కార్యాచరణను ఈ భేటీలో రూపొందించారు. రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 15 నుండి నిరవధిక బంద్‌కు కాలేజీల యాజమాన్యాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతుందనే నేపథ్యంలో ప్రభుత్వం కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన చర్చలకు సానుకూలంగా స్పందించి యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి. ప్రభుత్వంతో చర్చల అనంతరం దసరా, దీపావళిలోగా పెండిరగ్‌లో ఉన్న బకాయిల్లో రూ.600 కోట్లను విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడి రెండు వారాలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంకా బిల్లుల సొమ్ము విడుదల చేయలేదు. దీంతో మరోసారి ఆందోళన బాట పట్టేందుకు ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే కాలేజీలు బంద్‌ అవుతాయనే ప్రచారంతో పిల్లల చదువులపై ప్రభావం పడుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *