జైళ్ల‌లోని ఖైదీలను విడుదల చేయాలి

– ‘అర్బన్ నక్సల్స్’ పేరుతో వేధింపులు తగవు
– మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు  దేవుజీ డిమాండ్

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని పార్టీ కేంద్ర పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రధాన మీడియా ప్రతినిధులతో శుక్రవారం మాట్లాడుతూ, వేర్వేరు మీడియా ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తాను ప్రభుత్వాలకు లొంగిపోలేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల సమన్వయంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలోని ఇతర ప్రాంతాలకు వెళుతున్న సందర్భంలో పోలీసుల చేతికి చిక్కినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసులు తమను సరెండర్ గా చూపించారని, తాము ఉద్యమాల వ్యూహంలో భాగంగానే సరెండర్ అయినట్లు ఒప్పుకున్నామని పేర్కొన్నారు. కగార్ ఆపరేషన్ క్రమంలో మావోయిస్టు పార్టీ తీవ్రమైన నష్టాలకు గురైందని చెప్పారు. పార్టీ సమావేశాలు సమన్వయం చేసుకోవడంలో ఆలస్యం కావడం వల్లనే మల్లోజుల వేణుగోపాల్ రావు, తక్కెళ్ళపల్లి వాసుదేవరావు లొంగుబాటు ప్రకటనలతో తీవ్ర గందరగోళం ఏర్పడిందని దేవుజీ చెప్పారు. ప్రజల కోసం, లొంగుబాటు లోని కార్యకర్తలను సమన్వయం చేయడానికి బయటికి వచ్చామన్నారు. ప్రజాపోరు ఆలో చన విధానంలోనే తాము ప్రయాణించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ పోరాట ప్రణాళిక మొత్తం చట్టపరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల కోసం నిజాయతీగా పనిచేసే నాయకులను అర్బన్ నక్సల్స్ పేరుతో వేధించడం తగదన్నారు. జన జీవన స్రవంతులు కలిసి పోరాటాలు చేసుకోవచ్చని చెప్పిన పాలకులు మళ్లీ అదే మార్గంలో తమపై నిర్బంధాలను ప్రయోగించడం, అక్ర మ అరెస్టులతో జైళ్ల‌లో నిర్బంధించడం తగదని ఆయన తెలిపారు. పార్లమెంటరీ పంథాలో పనిచేయడం అంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనడమే అవుతుందన్నారు. తాము మాత్రం ఎన్నికల్లో పాల్గొనబోమని ఆయన ఖరాకండిగా స్పష్టం చేశారు. తమకు ఎన్నికల రాజకీయాల పట్ల ఎలాంటి భ్రమలు లేవని ఆయన పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలతోనే ప్రజా సమస్యలు పరి ష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. మ ల్లోజుల వేణుగోపాల్, వాసుదేవరావు ప్రజా ఉద్యమంపై విశ్వాసం కోల్పోయి ప్రాణభయం తో పాలకులతో ములాకత్ అయ్యారని ఆరో పించారు. ఆగస్టు, 24 లో సీసీ సమావేశంలో లొంగుబాటుపై ఏ విధమైన చర్చ జరగలేదని పేర్కొన్నారు. సెప్టెంబర్-2024 సీసీ సమావేశానికి వేణుగోపాలరావు రావాల్సి ఉన్నప్పటికీ రాకుండానే మహారాష్ట్ర ప్రభుత్వంతో సంభాషణలోకి వెళ్లారని పేర్కొన్నారు. ప్రజా పోరాటమే తమ రాజకీయ ఆచరణకు గీటురా యిగా నిలుస్తుందని చెప్పారు. తమ రాజకీయ పార్టీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన నాయకులను కూడా విడుదల చేయాలని దేవుజీ డిమాండ్ చేశారు. చట్ట పరిధిలో తాము పని చేస్తున్న క్రమంలో తమ మీద కూడా పాలకులు నిర్బంధాలు ప్రయోగించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నిస్వార్ధంగా ప్రజల కోసం పనిచేయడానికి ముందుకు వస్తామని తెలిపారు. ఇతర పార్టీలతో కలవాల్సిన అవసరం తమకు లేదన్నారు. మరో కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి మాట్లాడుతూ ఆయుధాలు వదలడంపై సెప్టెంబర్ 2024 అంతర్గత సమావేశం చర్చలకు రాకుండానే వేణుగోపాల్ లొంగుబాటుకు సిద్ధపడి బయటకు పోయారని ఆరోపించారు. నంబాళ కేశవరావు మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నిక జరగలేదని స్పష్టం చేశారు. పార్టీ పని చేసుకుంటూపోయాము తప్ప ఎలాంటి ఎన్నిక జరగలేదని చెప్పారు. ఆపరేషన్ కగారతో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. మిగిలిన ప్రజాశక్తులను కాపాడుకోవాలని నిర్ణయంతో లీగల్ పనిచేయడానికి బయటకు వచ్చినట్లు రాజిరెడ్డి వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *