హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్`2025 తెలంగాణ ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో జరిగిన అనేక పోటీలలో పతకాలు సాధించిన వారిని సీఎం అభినందించారు. మొత్తం 133 పతకాల్లో 28 (21 బంగారు, 4 రజతం, 3 కాంస్యం) పతకాలు తెలంగాణ టీం కైవసం చేసుకున్నది. ఈ కార్యక్రమంలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, జైళ్ల విభాగం డీజీ సౌమ్య మిశ్రా, ఐజీ మురళి బాబు, వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, ఎస్పీలు శివకుమార్ గౌడ్, కళాసాగర్, డ్యూటీ మీట్ పోటీ విజేతలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





