9 నుంచి అఖిల భారత జైలు డ్యూటీ మీట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు హైదరాబాదులోని ఆర్బీవీఆర్‌ఆర్‌ తెలంగాణ పోలీస్‌ అకాడమీలో తెలంగాణ జైళ్లు, సవరణాశాఖ ఆధ్వర్యంలో 7వ అఖిల భారత జైలు డ్యూటీ మీట్‌ జరగనుంది. దీనిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిస్తారు. దేశంలోని 21 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి వచ్చిన 1,300 మందికి పైగా జైలు సిబ్బంది (ఇందులో 184మంది మహిళలు) పాల్గొని 36 విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. వీటిలో ప్రథమ చికిత్స, వెల్ఫేర్‌ పథకాలు, క్విజ్‌, కంప్యూటర్‌ నైపుణ్యం వంటి వృత్తి సంబంధిత పోటీలు, అలాగే అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, కబడ్డీ, బాస్కెట్‌బాల్‌, కరాటే, క్రావ్‌ మాగా, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి క్రీడలు, సాంస్కృతిక పోటీలు ఉంటాయి. ఈ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం రెండవసారి ఆతిథ్యం ఇస్తోంది. 2015లో తొలిసారి నిర్వహించగా, 2022లో అహ్మదాబాద్‌లో జరిగిన 6వ జైలు డ్యూటీ మీట్‌లో తెలంగాణ రాష్ట్రం ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించింది. ఈసారి తొలిసారిగా ఆల్‌ ఇండియా టెక్నో ఎక్స్‌పో, జైలు ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. సన్నాహక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జైలు సవరణాశాఖ మహానిర్దేశకులు డాక్టర్‌ సౌమ్య మిశ్రా తెలంగాణ కాంటిజెంట్‌ జట్టు సభ్యులైన 84 మందికి క్రీడా కిట్లను పంపిణీ చేసి, జాతీయ స్థాయిలో క్రమశిక్షణతో ఆత్మవిశ్వాసంగా రాణించాలని ప్రోత్సహించారు. కార్యక్రమానికి సంబంధించి శాఖ, బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ %డ% డెవలప్‌మెంట్‌(బీపీఆర్‌ అండ్‌ డీ) న్యూఢల్లీి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ కార్యక్రమంలో సీఎస్‌ రామకృష్ణ రావు, హోమ్‌ శాఖ స్పెషల్‌ సి.ఎస్‌ రవిగుప్త, డీజీపీ జితేందర్‌లు పాల్గొంటారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *