– నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ
– విపక్ష ముఖ్యమంత్రలు హాజరు
– ఎప్పటి మాదిరిగానే మమతా బెనర్జీ గైర్హాజరు
– ముఖ్యమంత్రులను ఆప్యాయంగా పలకరించిన మోదీ
– స్టాలిన్‌తో ప్రధాని ముచ్చట్లు
– తెలంగాణ, జార్కండ్ ముఖ్యమంత్రులతో మోదీ
కేంద్రం, రాష్ట్రాలు టీమ్ ఇండియాలాగా కలిసి పనిచేస్తే.. ఏ లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని ప్రధాని మోదీ అన్నారు. దిల్లీలోని భారత్ మండపంలో మోదీ అధ్యక్షతన శనివారం నీతి ఆయోగ్ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2047 వరకు అభివృద్ధి చెందిన భారతదేశ ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ప్రధాని మోదీ వారితో టీ తాగుతూ చర్చిస్తున్న ఫొటోలు కనిపించింది. కానీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో లాగానే ఈ కౌన్సిల్‌కి హాజరు కాలేదు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ’మనం అభివృద్ధి వేగాన్ని పెంచాలి. కేంద్రం, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా టీం ఇండియాలాగా కలిసి పనిచేస్తే ఏ లక్ష్యం అసాధ్యం కాదు అని చెప్పినట్లు నీతి అయోగ్ ఎక్స్ పోస్టు ద్వారా వెల్లడించింది. వికసిత్ భారత్ 2047 థీమ్‌తో ఈ కౌన్సిల్ సమావేశం జరిగినట్లు మోదీ వెల్లడించారు. ప్రతి భారతీయుడి లక్ష్యం వికసిత్ భారత్, ప్రతి రాష్ట్రం వికసిత్ అయినప్పుడు.. భారత్ కూడా వికసిత్ అవుతుంది. ఇది 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్ష అని మోదీ అన్నారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆంధప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతోనూ ప్రధాని మోదీ ముచ్చటించారు. ప్రతిపక్ష ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. ప్రధాని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులతో కలిసి ఫోటో దిగారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో భాగం. కానీ ప్రధాని మోదీ, ఎంకే స్టాలిన్‌కి మధ్య ఇటీవలి భాషా వివాదంపై వాడీవేడి రాజకీయం రాజుకున్న విషయం తెలిసిందే. భాషా వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కఠిన వైఖరి తీసుకున్నారు.
చంద్రబాబు నాయుడు ఈ అంశంపై మిశ్రమ వైఖరిని కనబర్చినట్లు అనిపించింది. అయితే, నీతి ఆయోగ్ సమావేశం తర్వాత భారత్ మండపంలో ఇద్దరు నాయకులు ప్రధాని మోదీతో చాలా ఆప్యాయంగా కనిపించారు. ముచ్చట్లు పెడుతూ నవ్వులు పూయించారు. మరో ఫోటోలో కాంగ్రెస్ పాలిత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రధాని మోదీని కలిసిన దృశ్యాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా కనిపిస్తున్నారు. ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డిని చాలా ఆప్యాయంగా పలకరించారు. ఈ సమావేశంలో, ప్రధాని మోడీ రాష్ట్రాలకు ఓ విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి వేగాన్ని పెంచాలని, కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తే ఏ లఁ్‌యమూ అసాధ్యం కాదని ప్రధాని అన్నారు. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు