ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘటనపై ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. ‘ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా. మావోయిజం ముప్పును నిర్మూలించి.. ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని పేర్కొన్నారు.
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు (70) అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు ఎక్స్ వేదికగా అమిత్ షా వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘మావోయిజం నిర్మూలనలో ఇదొక మైలు రాయి అని చెప్పదగ్గ విజయం. 2026 మార్చి 31 నాటికి మావోయిజాన్ని నిర్మూలించేందుకు మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది‘ అని రాసుకొచ్చారు.





