అనారోగ్యానికి అడ్డుకట్ట… ఆరోగ్య రక్షణలో దిక్సూచిగా యోగా

“జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వంద రోజుల కౌంట్‌డౌన్ మార్చి 13తో మొదలవుతోంది. ఒక పురాతన జీవన విధానంగా మొదలై.. నేడు విశ్వవ్యాప్త గుర్తింపు పొందిన, శాస్త్రీయ ఆరోగ్య సాధనంగా నిలిచిన యోగా పరిణామ విశేషాలను చర్చించుకునేందుకు ఇది సరైన తరుణం. దైనందిన యోగ సాధనను ఆరంభించేలా, లేదా గతంలో మానేసిన యోగ సాధనను తిరిగి మొదలుపెట్టేలా.. ఈ వంద రోజులూ మనకు స్ఫూర్తినివ్వాలి. కుటుంబ సభ్యులూ, మిత్రులూ, మన ఇరుగూపొరుగూ ఒక జీవన విధానంగా యోగాను అందిపుచ్చుకునేలా ప్రోత్సహించేందుకు ఇదే సరైన తరుణం.”

-ప్రతాపరావు జాదవ్

సంప్రదాయ ఆరోగ్య పద్ధతిగానే కాకుండాఆరోగ్యకరమైన జీవన విధానంగా కూడా గత దశాబ్ద కాలంగా యోగా విస్తృత గుర్తింపును పొందుతోందిశాస్త్రీయంగానూ దీనికి రుజువులున్నాయిదేశ సాంస్కృతిక వారసత్వంగానే కాదు.. ప్రజారోగ్య రంగంలో శక్తిమంతమైన సాధనంగా యోగాను అవగతం చేసుకోవడానికి వైజ్ఞానిక పరిశోధనలుడిజిటల్ ఆవిష్కరణలుఅంతర్జాతీయ సహకారం వంటివన్నీ విశేషంగా దోహదం చేస్తున్నాయిసంప్రదాయ వైద్యం (యోగాకోసం డబ్ల్యూహెచ్వో అనుబంధ కేంద్రంగా మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ (ఎండీఎన్ఐవైఎంపికవగా.. మరోసారి 2025 – 2029 కాలానికి దీన్ని పునరుద్ధరించారుయోగా పరిశోధనలో భారత అగ్రగణ్యతను ఇది స్పష్టం చేస్తోందిఅసాంక్రమిక వ్యాధుల  నివారణ  కోసం  శాస్త్రీయ ఆధారాలతో కూడిన యోగా పద్ధతులను ప్రోత్సహించడంలో సంస్థ ప్రాధాన్యానికి ఇది నిదర్శనంఆయుష్ మంత్రిత్వ శాఖ, దిల్లీ  ఎయిమ్స్లేడీ హార్డింజ్ వైద్య కళాశాలకేంద్ర యునానీ ఔషధ పరిశోధన మండలి, దిల్లీలోని న్యూక్లియర్ ఔషధ – అనుబంధ విజ్ఞాన  శాస్త్రాల సంస్థ  కృషిలో కీలక భాగస్వాములుగా ఉన్నాయి.

 సంస్థలన్నింటి సహకారంతో మధుమేహంఊబకాయంమానసిక ఒత్తిడి సంబంధిత రుగ్మతల్లాంటి అసాంక్రామిక వ్యాధుల నివారణ కోసం యోగా ఆధారిత విధానాలపై  కేంద్రం సాంకేతిక మార్గదర్శకాలను రూపొందించడంతోపాటు పరిశోధనలను ముమ్మరం చేస్తోందిఅంతర్జాతీయ సంస్థలు కూడా  ప్రయత్నాల్లో పాలుపంచుకుంటున్నాయియోగాకు శాస్త్రీయ ప్రాతిపదికలను మరింత బలోపేతం చేయడమే కాకుండా  ముందుస్తు  ఆరోగ్య  సంరక్షణ దిశగా శాస్త్రీయ  ఆధారాలున్నతక్కువ వ్యయంతోవిస్తృతంగా అమలు చేయదగిన సాధనంగా యోగా సమర్థతను ఇది చాటుతోందిసంస్థాగతంగా యోగా శాస్త్రీయ ప్రాతిపదికలను ఎండీఎన్ఐవై మరింత బలోపేతం చేస్తోందిశరీర ధర్మశాస్త్రంజీవ రసాయన శాస్త్రంబయోమెకానిక్స్మనో విజ్ఞాన శాస్త్ర పరిశోధన ప్రయోగశాలల ద్వారా.. యోగా వల్ల కలిగే మనో–  శారీరకజీవ రసాయన మార్పులనూవృద్ధాప్య ప్రక్రియలో యోగా పాత్రనూజీవనశైలి సంబంధిత రుగ్మతలపై యోగా ప్రభావాన్నీ  సంస్థ నిశితంగా పరిశీలిస్తోందిఆధునిక శాస్త్రీయ ప్రమాణాలతో సంప్రదాయ విజ్ఞానాన్ని అనుసంధానించడంలో భారత్ అంకితభావానికి ఇది నిదర్శనం.

వైజ్ఞానిక ఆధారాలున్న పద్ధతులను నేరుగా ప్రజల దైనందిన జీవితాల్లోకి తీసుకెళ్తూ.. డిజిటల్ వేదికలు యోగా పరిధిని మరింత విస్తృతపరిచాయియోగా ప్రామాణికతనూచికిత్సా విలువలనూ కాపాడుతూనేవిస్తృతంగా దాన్ని ప్రజలకు ఎలా చేరువ చేయవచ్చో ఎమ్యోగా మొబైల్ అప్లికేషన్వై బ్రేక్ ప్రొటోకాల్  వంటి కార్యక్రమాలు  నిరూపిస్తున్నాయి.   ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో రూపొందించిన ‘ఎమ్యోగాను ఇప్పటికే 1.1 లక్షల మందికి  పైగా డౌన్లోడ్‌ చేసుకున్నారు.   అందుబాటులో ఉండే డిజిటల్ ఆరోగ్య సాధనాలపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తోందిఅదేవిధంగా ‘వై–  బ్రేక్’ కార్యక్రమం రోజూ  పనివేళల్లో  నుంచి 10 నిమిషాల యోగా విరామ సమయంగా కేటాయించేలా ప్రోత్సహిస్తోందిఇప్పటికే 33 లక్షలకు పైగా ప్రభుత్వాధికారులు ఇందులో భాగస్వాములయ్యారు.

 కార్యక్రమాల ద్వారా వెలువడుతున్న పరిశోధన ఫలితాలుప్రజల భాగస్వామ్య గణాంకాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయిక్రమం తప్పకుండా వైబ్రేక్ పద్ధతులను పాటించడం వల్ల కొన్ని వారాల్లోనే మానసిక ఒత్తిడి 40 శాతం వరకు తగ్గుతున్నట్టు వెల్లడైందిమానసికంగా చురుగ్గా ఉండడంభావోద్వేగ స్థిరత్వంనిర్ణయాత్మక సామర్థ్యం మెరుగుపడడంతోపాటు.. కార్టిసాల్ స్థాయి వంటి శారీరక సూచీల్లోనూ సానుకూల మార్పులు వస్తున్నట్టు అధ్యయనాల ద్వారా వెల్లడవుతోందిమెడభుజంనడుము నొప్పి తగ్గడంప్రాణాయామం ద్వారా శ్వాస సామర్థ్యం మెరుగుపడడంమొత్తంగా జీవశక్తి పెరగడం వంటి శారీరక ప్రయోజనాలు కనిపిస్తున్నాయిస్క్రీన్లను చూస్తూ గంటల కొద్దీ ఒకేచోట కూర్చుని ఉండే నేటి పని వాతావరణాల్లో ఇవి అత్యంత ఆశాజనకమైన ఫలితాలనే చెప్పాలి. ‘వైబ్రేక్’ కార్యక్రమం  వల్ల గైర్హాజరీ  తగ్గడంతోపాటు  ఉద్యోగుల నైతిక స్థైర్యం పెంపొందుతోందిఅలాగే పని – జీవనం మధ్య  ఆరోగ్యకరమైన  సమతౌల్యం మెరుగుపడుతోందివ్యక్తిగత ఆరోగ్యంతోపాటు  సంస్థాగత  శ్రేయస్సునూ పెంపొందించడంలో యోగా సమర్థతకు ఇది నిదర్శనం.

మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థకేంద్ర యోగా – ప్రకృతి వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా నిర్వహించిన ‘జాతీయ ప్రాకృతిక చికిత్సల సదస్సు – 2026’ సందర్భంగా.. శాస్త్రీయ ధ్రువీకరణల ప్రాధాన్యాన్ని కూడా నిపుణులు ప్రముఖంగా ప్రస్తావించారుకచ్చితమైన పరిశోధనలువివిధ విభాగాల మధ్య సమన్వయంపటిష్టమైన డిజిటల్ భాగస్వామ్యం ద్వారా.. ఆధునిక ఆరోగ్య రక్షణ వ్యవస్థలతో యోగాను ఏకీకృతం చేయాలనీతద్వారా స్పష్టమైన ఫలితాలను సాధించగలమనీ నిపుణులు స్పష్టం చేశారు.

ప్రపంచం యోగాను చూస్తున్న తీరు గణనీయంగా మారుతోందని  పరిణామాలు స్పష్టం చేస్తున్నాయియోగా ఇప్పుడు వ్యక్తిగత ఆరోగ్య సాధనం మాత్రమే కాదు.. ప్రజారోగ్యనైపుణ్యాభివృద్ధిఉపాధి అవకాశాల మార్గం కూడావిజ్ఞానంతోనూసాంకేతికతతోనూ సంప్రదాయాన్ని మేళవించడం ద్వారా.. ప్రపంచ యోగా క్రాంతికి ఇది చోదక శక్తిగా నిలుస్తోందితద్వారా అంతర్జాతీయంగా ఆరోగ్య రంగంలో ముందంజలో నిలిచేలా భారత్ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తోంది.

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వంద రోజుల కౌంట్డౌన్ మార్చి 13తో మొదలవుతోందిఒక పురాతన జీవన విధానంగా మొదలై.. నేడు విశ్వవ్యాప్త గుర్తింపు పొందినశాస్త్రీయ ఆరోగ్య సాధనంగా నిలిచిన యోగా పరిణామ విశేషాలను చర్చించుకునేందుకు ఇది సరైన తరుణందైనందిన యోగ సాధనను ఆరంభించేలాలేదా గతంలో మానేసిన యోగ సాధనను తిరిగి మొదలుపెట్టేలా..  వంద రోజులూ మనకు స్ఫూర్తినివ్వాలికుటుంబ సభ్యులూమిత్రులూమన ఇరుగూపొరుగూ ఒక జీవన విధానంగా యోగాను అందిపుచ్చుకునేలా ప్రోత్సహించేందుకు ఇదే సరైన తరుణం.

యోగాను మన దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకోవడం ద్వారా వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా.. సామాజిక సంక్షేమాన్నీసంస్థాగత సామర్థ్యాన్నీసామాజిక సామరస్యాన్నీ పెంపొందించిన వాళ్లమవుతాంనేడు పరిశోధనలుసాంకేతికతఅంతర్జాతీయ సహకారం ద్వారా భారత్ నిశ్చయాత్మకంగా మరో అడుగు ముందుకేస్తోందికాలాతీతమైన యోగ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా ధ్రువీకరించి.. ఆరోగ్యానికీసమతౌల్యానికీశ్రేయస్సుకూ ఒక సుస్థిరమైన సార్వజనీన మార్గంగా నిలుపుతోంది.

 (రచయిత కేంద్ర ఆయుష్ శాఖ సహాయ (స్వతంత్ర హోదా), ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *