గ్యాస్‌ ‌కొరత నివారణకు కేంద్రం చర్యలు

– 20శాతం అదనపు కమర్షియల్‌ ‌గ్యాస్‌ ‌సరఫరా

న్యూదిల్లీ, మార్చి 21: వాణిజ్య గ్యాస్‌ ‌కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా 20శాతం కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. తాజా చర్యతో సంక్షోభ కాలానికి ముందున్న కేటాయింపుల్లో 50శాతానికి చేరినట్లయ్యిందని పేర్కొంది. అయితే, వీటిలో హోటళ్లు, రెస్టరంట్లు, దాబాలు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్లు, కమ్యూనిటీ కిచెన్‌లు, సబ్సిడీల్లో ఆహారం అందించే కేంద్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచించింది. చమురు కంపెనీల వద్ద రిజిస్టరైన వాణిజ్య సంస్థలతోపాటు పీఎన్‌జీ (పైపు ద్వారా గ్యాస్‌ ‌పంపిణీ) కనెక్షన్‌ ‌కోసం దరఖాస్తు చేసుకున్న వాటికే ఈ అదనపు కేటాయింపు వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. మార్చి 23 నుంచి నుంచి ఈ అదనపు కేటాయింపులు సరఫరా చేస్తామని తెలిపింది. దీంతోపాటు వలస కూలీలకు ఐదు కిలోల గ్యాస్‌ ‌సిలిండర్లు అందజేయాలని సూచించింది. సిలిండర్లు పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాలకు పెట్రోలియంశాఖ కార్యదర్శి లేఖ రాశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *