– గోపాలపురం, వడ్డేపల్లి చెరువులకు రిటైనింగ్ వాల్ నిర్మాణం తక్షణం చేపట్టాలి
– హన్మకొండలో బాధితుల మహా ర్యాలీ, ధర్నా
హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్ 8: గోపాలపురం ఊర చెరువు, వడ్డేపల్లి చెరువు నుండి వచ్చే వరద కాలువకు రిటైనింగ్ వాల్ తక్షణమే నిర్మించాలని, అండర్ డ్రైనేజీ డక్‌ను వడ్డేపల్లి మత్తడి నుండి 100 ఫీట్ రోడ్డు ద్వారా గోపాలపురం వరకు శాస్త్రీయ పద్ధతిలో రిటైనింగ్ వాల్‌ను తక్షణమే నిర్మించాలనే డిమాండ్‌తో శనివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తులసి బార్ జంక్షన్ వద్ద వరద ముంపు బాధితులు మహా ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం బాధితులు భారీ ర్యాలీగా కే.యూ జంక్షన్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టి ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీలో వేలాదిమంది వరద ముంపునకు గురైన కాలనీల ప్రజలు పాల్గొన్నారు. ఆయా కాలనీల అధ్యక్షులు మాట్లాడుతూ హనుమకొండలోని 56, 57వ డివిజన్లలో గోపాలపురం ఊర చెరువు కట్ట తెగిపోవడంతో వివేక్‌నగర్, ప్రగతినగర్, హుడా కాలనీ, టీవీ టవర్, సమ్మయ్యనగర్, ఇంజనీర్ కాలనీ, ఎన్జీవోస్, శ్యామల దుర్గాదాస్, అమరావతి నగర్, శ్రీనివాస కాలనీ తదితర కాలనీలు ప్రతి ఏటా తీవ్రంగా వరదల్లో మునిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ విపత్తును నివారించడం లో మత్తడి నాలాను మూసివేసి భూగర్భ జల సొరంగం గేట్లు ఎత్తివేయడంలో అధికారులు విఫలమయ్యారని వక్తలు అన్నారు. జీవో ఎంఎస్ 81 ప్రకారం ప్రతి సంవత్సరం చెరువుల సిల్ట్ తొలగించడం, ఎఫ్టిఎల్ సరిహద్దులు గుర్తించడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, చెరువుల సంరక్షణ చేయాల్సిన జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖదే బాధ్యత అయినప్పటికీ దానిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
ఈ సందర్బంగా పలు ముఖ్య డిమాండ్లను అమలు చేయాలని కాలనీల ప్రజలు కోరారు.
1. గోపాలపురం ఊర చెరువుకు శాశ్వత రిటైనింగ్ వాల్ నిర్మించాలి.
2. వడ్డేపల్లి చెరువు నుండి వచ్చే కాలువకు రిటైనింగ్ వాల్ తక్షణం నిర్మించాలి.
3. వడ్డేపల్లి మత్తడి నుండి గోపాలపురం వరకు అండర్ డ్రైనేజీ మార్గాలను సైంటిఫిక్‌గా రిటైనింగ్ వాల్ తక్షణం నిర్మించాలి.
4. వరద ముంపునకు కారణమైన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి.
5. వరద బాధితులకు సరైన పరిహారం అందించాలి, శాశ్వత పునరావాస చర్యలు చేపట్టాలి.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కాలనీ ల సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టకపోతే, అన్ని కాలనీల ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ (%జీAజ%) ఏర్పాటు చేసి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో
100 ఫీట్ల రోడ్ అభివృద్ధి కమిటీ ఐకాన్ కన్వీనర్, శ్యామల దుర్గాదాస్ కాలనీ అధ్యక్షులు డాక్టర్ నల్లాని శ్రీనివాస్, వివేక్‌నగర్ కాలనీ అధ్యక్షులు మర్రి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మీసాల రమేష్, సామాజిక కార్యకర్తలు వి. వీరన్న, తుపాకుల దశరథం, శ్రీధర్ రెడ్డి, దేవ్ సింగ్, నవీన్ నాయక్, రాజ్‌కుమార్, ఎల్. దీప, ఎం. చుక్కయ్య, రాజు అలాగే ప్రగతి నగర్ అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్, బూర నారాయణ (టీఎన్జీవోస్ అధ్యక్షులు), పింగిలి అశోక్ రెడ్డి, లింగంపల్లి వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





