– డాక్టర్ అనితా రెడ్డి
వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, వారికి ఆర్థిక, ఆరోగ్య, విద్యా సమస్యలను కలిగిస్తాయని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు, పోష్ చట్టం ఎక్స్‌టర్నల్ మెంబర్ డాక్టర్ అనితారెడ్డి తెలిపారు. ప్రజ్వలా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వరంగల్ ఆధ్వర్యంలో పర్వతగిరి కేజీబీవీ పాఠశాలలో పిల్లలకు బాల్యవివాహాల, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, జువెనైల్ జస్టిస్ చట్టం, పోష్ చట్టంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ గ్రామం నుండి నగరం వరకు బాల్య వివాహాలను, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా అరికట్టే బాధ్యత మనందరిదీ అంటూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వల్ల కలిగే ఇబ్బందులపై అవగాహన కల్పించారు. అందుకు ప్రతి స్వచ్ఛంద సంస్థ, సామాజిక కార్యకర్తలు, మహిళలు, యువత, గ్రామ పెద్దలు కృషి చేయాలన్నారు. బాల్య వివాహాలపై అవగాహన పెంపొందించి ఈ పరిస్థితిని సమూలంగా మార్చేద్దామన్నారు. బాల్య వివాహాలు చేయడం, బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని, బాలల హక్కులను కాపాడుతూ వారికి అందమైన భవిష్యత్తునందించాలని, బాలలకు బాల్యం ఎంతో ముఖ్యమైనదని అన్నారు. తమకు తామే రోల్ మోడల్‌గా ఉండి భవిష్యత్తును చక్కదిద్దుకుని మంచి పౌరులుగా ఎదగాలని, సరైన ప్రణాళికలు రూపొందించుకొని చక్కటి జీవితాన్ని పొందాలని పిల్లలకు ఆమె సూచించారు. ఉపాధ్యాయినులకు పోష్ చట్టంపై అవగాహన కల్పించారు. పని ప్రదేశాలలో ఇబ్బందులు ఎదురైనప్పుడు పోష్ చట్టం-2013 ఉపయోగించుకోవాలన్నారు, కార్యక్రమంలో వర్షిణి, సుజాత, కళాశాల ప్రిన్సిపాల్ సలీమా, టీచర్స్, సిబ్బంది పాల్గొన్నారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





