రాష్ట్రంలో 17 నుండి 21 వరకు రాష్ట్రపతి పర్యటన

– ఏర్పాట్లపై ఆయా విభాగాల అధికారులతో సీఎస్‌ సమీక్ష

హైదరాబాద్‌, డిసెంబర్‌ 11 : శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజులపాటు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై డాక్టరు బి.ఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన గురువారం సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటనకు కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీసు శాఖ తగు భద్రత, ట్రాఫిక్‌, బందోబస్తు ప్రణాళికను రూపొందించాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితోపాటు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్‌ టెండర్లను ఏర్పాటు చేయాలని, వైద్య, ఆరోగ్యశాఖ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ విభాగం అవసరమైన బారికేడిరగ్‌లు, ఇతర ఏర్పాట్లు చేయాలని, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటలు స్నేక్‌ క్యాచర్‌ బృందాన్ని అందుబాటులో వుంచాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ సమన్వయంతో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, అదేవిధంగా తేనెటీగలను పట్టుకోవానికి ముందుస్తు ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ శివధర్‌ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి.వి.ఆనంద్‌, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, పొలిటికల్‌ కార్యదర్శి ఈ.శ్రీధర్‌, అదనపు డీజీపీలు మహేష్‌ భగవత్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్‌ సింగ్‌ మాన్‌, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సీహెచ్‌.ప్రియాంక, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ శివలింగయ్య, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *