– పదేళ్లలో పేదల కోసం 4 కోట్ల ఇళ్ల నిర్మాణం
– వరి ఉత్పత్తిలో ప్రపంచంలో నంబర్ వన్
– అక్వా, పాల ఉత్పత్తుల్లో భారత్ ముందంజ
– గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివద్ధి
– పవర్ టెక్నాలజీ హబ్?గా రూపొందుతున్న భారత్
– గ్రీన్ ఎనర్జీ రంగంలో పవర్ హౌస్‌గా భారత్
– పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
న్యూదిల్లీ, జనవరి 28: పేదల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత పదేళ్లలో పేదల కోసం నాలుగు కోట్ల ఇళ్లు కట్టించామని, జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని రాష్ట్రపతి ద్రౌపది పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజైన బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, సామాజిక న్యాయం ప్రాతిపదికన కేంద్రం పనిచేస్తోందని తెలిపారÁT. ప్రతి పౌరుడికి జీవిత బీమా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని, ఆయుష్మాన్ భారత్‌తో కోట్లమందికి వైద్యసేవలందిస్తున్నామని వివరించారు. వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నెం.1 స్థానంలో నిలిచిందని, అక్వా, పాల ఉత్పత్తుల్లో భారత్ ముందంజలో ఉందని రాష్ట్రపతి వెల్లడించారు. దేశంలో స్పేస్ టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయన్నారు. భవిష్యత్తులో అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, జమ్మూకశ్మీర్‌లో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించామని గుర్తు చేశారు. గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్రపతి చెప్పారు. జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుతో దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్నామని, స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లోనూ భారత్ దూసుకెళ్తోందని, భారత్ పవర్ టెక్నాలజీ హబ్‌గా రూపొందుతోందని వివరించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్‌ను పవర్ హౌస్‌గా తయారు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వికసిత్ భారత్‌లో రైతుకు అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీ రామ్ జీ చట్టం తీసుకొచ్చామని, దేశాభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర కల్పించామని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ డిఫెన్స్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. నానో చిప్‌ల తయారీపైనా దృష్టి సారించిందని, మైక్రో చిప్‌ల తయారీలో స్వయంసమృద్ధి సాధించాల్సి ఉందని అన్నారు. ఎలక్టానిక్స్ పరిశ్రమలో 15లక్షల ఉద్యోగాలు సృష్టి, ముద్ర యోజన ద్వారా చిరు వ్యాపారులకు భారీగా రుణాలు వంటి ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాల్ని రాష్ట్రపతిపేర్కొన్నారు. పీఎం విశ్వకర్మ యోజనతో 20లక్షల మందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. 100 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు అందించామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. వికసిత్ భారత్?లో రైతులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం క షి చేస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దేశం సంస్కరణల పథంలో దూసుకెళ్తోందన్నారు. పీఎలఐ పథకం కింద పారిశ్రామికోత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సముద్ర వ్యాపారాన్ని మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు పార్లమెంట్‌కు చేరిన రాష్ట్రపతికి స్పీకర్ ఓం బిర్లా, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ తదితరులు ఘనంగా స్వాగతం పలికి సాదరంగా పార్లమెంట్ భవనంలోకి తోడ్కొని వెళ్లారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




