– తిరుచానూరులో పద్మవాతి అమ్మవారి దర్శనం
– రేపు శ్రీవారిని దర్శించుకోనున్న ముర్ము
తిరుమల,నవంబర్ 20: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ ఉన్నతాధికారులతోపాటు కూటమిలోని పార్టీల నేతలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుచానూరుకు రాష్ట్రపతి చేరుకున్నారు. తిరుచానూరులో కొలువు తీరిన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాలను రాష్ట్రపతికి వేద పండితులు అందజేశారు. ఇక రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుచానూరు లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్థానికుల రాకపోకలను నిలిపివేశారు. దాంతో స్థానికులు కొంత ఇబ్బంది పడ్డారు. ఇక తిరుచానూరు పర్యటన ముగించుకునిరేపు సాయంత్రం రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రపతి తిరుమల చేరుకుంటారు. రాత్రికి పద్మావతి అతిథి గృహంలో ఆమె బస చేస్తారు. శుక్రవారం ఉదయం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో తిరుమలలో సైతం పటిష్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు. తిరుపతి పర్యటన ముగిసిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





