పీఆర్‌సీఐ కాంక్లేవ్‌లో హైదరాబాద్‌కు అవార్డులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: గోవా పంజిమ్‌లో నిర్వహించిన పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌సీఐ) 19వ గ్లోబల్‌ కాన్‌క్లేవ్‌లో హైదరాబాద్‌ పీఆర్‌సీఐకి అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పీఆర్‌సీఐ తన 19వ గ్లోబల్‌ కాన్‌క్లేవ్‌ను ఈనెల, 26, 27 తేదీల్లో గోవా పంజిమ్‌లో ఘనంగా నిర్వహించింది. కాన్‌క్లేవ్‌ ప్రారంభోత్సవానికి గోవా రాష్ట్ర గవర్నర్‌ పి.అశోక్‌ గజపతిరాజు ముఖ్య అతిథిగా, అవార్డుల ప్రదానోత్సవానికి గోవా ముఖ్యమంత్రి డాక్టర్‌ ప్రమోద్‌ సావంత్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ స్థాయిలో ఉత్తమ పరిపాలన, పాలన అవార్డును పీఆర్‌సీఐ హైదరాబాద్‌ చాóాప్టర్‌ దక్కించుకుంది. హైదరాబాద్‌ పీఆర్‌సీఐ కమిటీ చైర్మన్‌గా షకీల్‌ అహ్మద్‌, వైస్‌ చైర్‌పర్సన్‌గా అనీజా, కార్యదర్శిగా ఫిలిప్‌ జాషువా, జాయింట్‌ సెక్రటరీగా జేకబ్‌రాస్‌, కోశాధికారిగా నోయెల్‌ రాబిన్సన్‌ ఉన్నారు. అలాగే జాతీయ స్థాయిలో మోస్ట్‌ వాల్యూయబుల్‌ లీడర్‌ అవార్డును ప్రకాశ్‌ జైన్‌ అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం, డీఎస్‌సీఐ, నాస్‌కామ్‌ సంయుక్తంగా నడుపుతున్న సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌కు సైబర్‌ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమాలకు ప్రతిష్టాత్మక చాణక్య అవార్డు లభించింది. హైదరాబాద్‌ పీఆర్‌సీఐ చైర్మన్‌ షకీల్‌ అహ్మద్‌కు గోవా ముఖ్యమంత్రి డాక్టర్‌ ప్రమోద్‌ సావంత్‌ జి.పి.జైకుమార్‌ మెమోరియల్‌ అవార్డు ఫర్‌ ఇంటెగ్రల్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ను ప్రదానం చేశారు. పవర్‌ ఆఫ్‌ పీఆర్‌-ఎమర్జింగ్‌ వేవ్స్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అనే థీమ్‌పై రెండు రోజులపాటు అనేక చర్చలు జరిగినాయి. కార్యక్రమంలో పీఆర్‌సీఐ ఛైర్మన్‌ మెరిటస్‌ ఎం.బి.జయరాం, జాతీయ అధ్యక్షుడు గీతా శంకర్‌, నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కె.రవీంద్రన్‌, పీఆర్‌సీఐ యంగ్‌ కమ్యూనికేటర్స్‌ కౌన్సిల్‌ నేషనల్‌ హెడ్‌ చిన్మయీ ప్రవీణ్‌, దక్షిణ భారత విభాగాధిపతి టివిఎస్‌ నారాయణ్‌, నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫ్రెడరిక్‌ మైఖేల్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *