బీబీకా ఆలంలో పొన్నం, అడ్లూరి ప్రార్థనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మొహర్రం సందర్భంగా డబీర్‌పురాలోని బీబీకా ఆలంను మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా బీబీకా ఆలంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు అమీర్‌ అలీఖాన్‌, ఎఫండీ, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అజ్మాతుల్ల హుస్సేనీ ఇతర మైనార్టీ ముఖ్య నేతలు కూడా బీబీకా ఆలంను సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు మొహరం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయించారు. వందల సంవత్సరాల ఆనవాయితీగా వస్తున్న ఊరేగింపు కోసం ఏనుగును తీసుకువచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *