ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

– మొత్తం 218 ఆర్జీల స్వీకరణ.
– హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : జిల్లాలోని నలుమూల నుండి వచ్చి ప్రజావాణిలో ప్రజలు అందజేసిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు కదివన్‌ పళని, జి.ముకుందరెడ్డి, డీఆర్‌వో ఇ. వెంకటాచారిలతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను కలెక్టర్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు శాఖలవారీగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఒకే సమస్యపై ధరఖాస్తుదారులు పదేపదే ప్రజావాణికి రాకుండా చూడాల్సిన భాద్యత సంబంధిత శాఖల అధికారులపై ఉందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజావాణి ముఖ్యోద్దేశమన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధుల వాట్సాప్‌ నెంబరు ద్వారా వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పరిష్కరించాలని, ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు తప్పకుండా పాల్గొనాలని అన్నారు. సీఎం ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తుల పురోగతిపై ఆమె సమీక్షించి పెండిరగ్‌లో ఉన్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌లో వచ్చిన ధరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అవరమైతే క్షేత్రస్ధాయిలో పర్యటించి త్వరితగతిన పరిష్కరించి పెండిరగ్‌ లేకుండా చూడాలన్నారు. ప్రజావాణిలో హౌసింగ్‌ శాఖ 133(డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు 37, ఇందిరమ్మ ఇండ్లు 96), పెన్షన్స్‌ 8, రెవెన్యూ 46, ఇతర శాఖలు 31 కలిపి మొత్తం 218 అర్జీలు అందాయని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో సికింద్రాబాద్‌ ఆర్డీవో సాయిరాం, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రమేష్‌, దివ్యాంగ శాఖ సహాయ సంచాలకుడు రాజేందర్‌, ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు ప్రవీణ్‌, ఆశన్న, ఇలియాస్‌, కోటాజీ, జీఎం ఇండ్రస్ట్రీస్‌ పవన్‌ కుమార్‌, కలెక్టరేట్‌ ఇన్‌చార్జి ఏవో విజయలక్ష్మి, జిల్లా సర్వే అధికారి శ్రీరామ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *