‘ప్రజావాణి’తో సమస్యలకు పరిస్కారం

– 74శాతం ఫిర్యాదులు పరిష్కరించాం
– ‘ప్రజావాణి’ వార్షికోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి 

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డి సెంబర్‌ 19:  ఇం‌దిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందుకోసం తామంతా అహరహం శ్రమిస్తున్నామని అన్నారు. అలాగే సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ప్రారంభించిన రెండేళ్లల్లో ఇప్పటి వరకు 74 శాతం ఫిర్యాదులు పరిష్కరించామని తెలిపారు. బేగంపేట ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రజావాణి 2వ వార్షికోత్సవానికి భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ‌జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి ఇన్‌ఛార్జి దివ్యదేవరాజన్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు లబ్దిదారుల తమ అనుభవాల పంచుకున్నారు. అంకితభావంతో సేవలు అందించి.. ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేసిన అధికారులను సన్మానించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ… రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి వస్తున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సాప్ట్‌వేర్‌ ‌రూపొందించి, అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ప్రజావాణికి స్పందన లేదని విపక్షాలు దుష్పచ్రారం చేస్తున్నాయని ఆక్షేపించారు. ఎంత దుష్పచ్రారం  చేసినా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారానికి దూరమైన విపక్షం ఎన్ని విమర్శలు చేసినా.. తాము మరింత ముందుకు వెళ్తామన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో వనరులు ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తామని హా ఇచ్చారు. ప్రజావాణి విజయవంతం చేసిన చిన్నారెడ్డి, దివ్యాదేవరాజన్‌కు భట్టి అభినందనలు తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ ప్రజల సమస్యేల పరిష్కార వేదిక సీఎం ప్రజావాణి అని పేర్కొన్నారు. ఇందిరమ్మ పాలనలో ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయని వారు అన్నారు.సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల కాలంలో సీఎం ప్రజావాణిలో ఒక లక్ష 07, 829 దరఖాస్తులు అందగా అందులో 64,623 దరఖాస్తులు పరిష్కారం అయ్యాయని, మిగతా 48, 064 దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయని, సమస్యల పరిష్కారం 74% శాతం ఉందని తెలిపారు. సిబ్బంది, అధికారులు ఎంతో ఓపికతో ప్రజల సమస్యలు వింటూ పరిష్కారం చూపుతున్నారని చిన్నారెడ్డి అభినందించారు. సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ ప్రజావాణి లక్ష్యాలను, సాధించిన పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి, హోసింగ్ శాఖ కార్యదర్శి వీ.పీ. గౌతమ్, సీ జీ జీ చైర్మన్ రవి గుప్తా, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరి చందన, తదితరులు పాల్గొన్నారు. సీఎం ప్రజావాణి ద్వారా లబ్ది పొందిన వివిధ వర్గాల ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడారు. పదేళ్ల క్రితం ఆర్టీసీలో సర్వీస్ నుంచి డిస్మిస్ అయిన 242 మంది డ్రైవర్స్, కండక్టర్స్ కు ప్రజావాణి ద్వారా తిరిగి ఉద్యోగాలు రావడం, కోర్టు కేసుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న 1,750 మందికి ప్రజావాణి ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అలాట్ కావడం, ఆరోగ్య సమస్యలు పరిష్కారం కావడం, గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం వంటి అనేక విజయ గాథలు ఈ కార్యక్రమంలో లబ్దిదారులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *