– భారీ వర్షంలోనూ తరలి వచ్చిన ప్రజలు
– దరఖాస్తులు స్వీకరించిన చిన్నారెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 102 దరఖాస్తులు అందాయి. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సీఎం ప్రజావాణిపై భరోసాతో ప్రజా భవన్‌కు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి తమ సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. వర్షంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజా భవన్ మెయిన్ గేట్ నుంచి ప్రజావాణి వరకు బ్యాటరీ వెహికల్‌లో సిబ్బంది తరలించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి 34, రెవెన్యూ శాఖకు సంబంధించి 21, ఇందిరమ్మ ఇండ్ల కోసం 26, ప్రవాసి ప్రజావాణికి 1 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 20 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





